బిజెపి వైపు పరిటాల సునీత: వెంకయ్యతో చర్చలు!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే పరిటాల సునీత పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బిజెపిలో చేరే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
అనంతపురం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి, అతని సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన కారణంగానే పరిటాల సునీత టిడిపిని వీడుతున్నట్లు తెలుస్తోంది. జెసి దివాకర్ రెడ్డి సోదరుల రాకను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిటాల సునీత టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

జెసి సోదరుల రాకను పరిటాల సునీత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా పార్టీ అధినేత వారిని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తి చేసినట్లు తెలియడంతో ఆమె టిడిపికి దూరంగా ఉండాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జెసి వర్గంపై పరిటాల సునీత వర్గానికి ఎప్పట్నుంచో వ్యతిరేకత ఉంది. తన భర్త, జిల్లా టిడిపి నాయకుడు పరిటాల రవిని హత్య చేయించింది కూడా జెసి వర్గమేనని పరిటాల సునీత వర్గం భావిస్తోంది.
జెసి సోదరులు పార్టీలోకి రాకముందే వర్గాలను తయారు చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇక పార్టీలో చేరితే వారి ఫ్యూడల్ పోకడలతో టిడిపిలో ఎవరూ మనుగడ సాగించలేరని సునీత వాపోయినట్లు తెలిసింది. గతంలోనే జెసి సోదరులను టిడిపిలో చేర్చుకోవద్దని చంద్రబాబుకు సునీత స్పష్టం చేసింది. జెసి సోదరులు టిడిపిలో చేరిన తర్వాత సునీత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
పరిటాలకు భయపడి పారిపోయారు: జెసి సోదరులపై అనంత
దివంగత టిడిపి నేత పరిటాల రవికి భయపడి గతంలో జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డిలు పారిపోయారని ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పుడు వారే తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం సిగ్గు చేటని అన్నారు. తాము మార్చి 23న టిడిపిలో చేరుతున్నట్లు జెసి దివాకర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన గురువారం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. జెసి సోదరులకు భయపడి ఓటేయడం మానకూడదని ప్రజలకు తెలిపారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర అనలేని పిరికిపంద అని అనంత ఆరోపించారు. చంద్రబాబు ద్వంద్వ నీతే విభజనకు కారణమని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన సాధ్యమవుతుందని అనంత తెలిపారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications