ప్రత్యేక హోదాపై టీడీపీ వాయిదా తీర్మానం, నాడు మోడీ ఏం చెప్పారు.. బీజేపీపై పల్లె ఫైర్
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో రోజైన బుధవారం కూడా టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీలకు కాంగ్రెస్ కూడా జత కలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదాపైటీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Recommended Video

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అంటే తెలుగు ప్రజలను దగా చేసినట్లేనని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని, ఏపీకి ఇస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతాయని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పల్లె స్పందించారు. దగా చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని నాడు మోడీ చెప్పారని, నేడు బీజేపీ బిడ్డను కూడా చంపేస్తోందని విమర్శించారు. ఏపీకి హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయని చెబుతున్నారని, అన్ని రాష్ట్రాలకు పార్లమెంటులో హోదాపై హామీలు ఇచ్చారా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications