పశ్చిమగోదావరి మొగ్గు ఎటు ? తాజా సర్వేలో వారికే ఎడ్జ్-ఆ సీట్లలో కాంగ్రెస్ ఎఫెక్ట్..!
ఏపీలో మరో నెల రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో జనం మొగ్గు ఎటువైపు ఉందన్న దానిపై పలు సర్వేలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని అధికార వైసీపీవైపు మొగ్గుతుంటే, మరికొన్ని విపక్ష ఎన్డీయే కూటమికి ఆధిక్యం కట్టబెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సెఫాలజిస్ట్ పార్ధాదాస్ తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా పరిస్ధితిపై తన అంచనాల్ని ఎక్స్ లో వెల్లడించారు.
పార్ధాదాస్ సర్వే ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల తరహాలోనే వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇది ఏ స్దాయిలో ఉందంటే వైసీపీకి వచ్చే ఓట్ల శాతం 47.4 శాతంగా ఉండే, ఎన్డీయే కూటమి పార్టీలకు వచ్చే ఓట్ల శాతం 47.3 శాతంగా ఉంది. కాంగ్రెస్ కు 4.2 శాతం ఓట్లు రాబోతున్నాయి. అలాగే పురుషులు, మహిళల మొగ్గులో చాలా తేడా ఉంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని పురుష ఓటర్లలో వైసీపీకి 44 శాతం ఓట్లు వస్తుంటే, ఎన్డీయే కూటమికి 50 శాతం ఓట్లు వస్తున్నాయి. మహిళా ఓటర్లలో ఇందుకు భిన్నంగా వైసీపీకి 57 శాతం ఓట్లు లభిస్తుంటే, ఎన్డీయే కూటమికి 40 శాతం ఓట్లు లభిస్తున్నాయి.
అలాగే సీఎంగా జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా 48 శాతం మద్దతిస్తున్నారు. చంద్రబాబుకు 40 శాతం, పవన్ కళ్యాణ్ కు 8 శాతం మద్దతిస్తున్నారు. షర్మిలకు 4 శాతం మంది ఓటేసారు. ప్రధానిగా మోడీకి 36.9 శాతం, రాహుల్ గాంధీకి 37 శాతం ఓట్లు లభించాయి.
ఉండి, తణుకు, చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించే అవకాశమున్నట్లు ఈ సర్వేలో తేల్చారు. అలాగే ఉండి, తణుకులో ఇండిపెండెంట్ అభ్యర్ధులు సైతం 8 శాతానికి పైగా ఓట్లు సాధించబోతున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కన ఆయా అభ్యర్ధులు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు గండి కొట్టబోతున్నారు. దీని ప్రకారం చూస్తే వైసీపీకి ఉమ్మడి జిల్లాల్లో 6 సీట్లు లభిస్తుండగా.. ఎన్డీయే కూటమికి 8 సీట్లు సాధించబోతోంది. మరో సీటులో హోరాహోరీ పోరు నెలకొంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications