Prakasam District Survey : ప్రకాశం జిల్లా మొగ్గు ఎటో తెలుసా ? తాజా సర్వే..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మొగ్గు ఎటువైపు ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు పలు సర్వే సంస్ధలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య ముఖాముఖీ పోరు నెలకొన్న నేపథ్యంలో ప్రజల నాడి ఎటుదనే అంశాన్ని పసిగట్టడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాలవారీగా సర్వేలు ఇస్తున్న సెఫాలజిస్ట్ పార్ధాదాస్ తాజాగా ప్రకాశం జిల్లాలో తాజా పరిస్దితిపై నివేదిక ఇచ్చారు.
పార్ధాదాస్ సర్వే ప్రకారం ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య అత్యంత హోరాహోరీ పోరు నెలకొని ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 సీట్లలో చేసిన సర్వేలో వైసీపీ, టీడీపీ ఇద్దరూ తలో ఐదు సీట్లు గెల్చుకోబోతున్నట్లు పార్ధాదాస్ అంచనా వేశారు. అలాగే మరో రెండు సీట్లలో ఇరువురి మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిపారు. ఈ లెక్కన చూస్తే ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలు ఏ పార్టీకి అంత సులువు కాదని తెలుస్తోంది.

Watch our survey findings from #Prakasham district for #APElections2024 :https://t.co/56RIigPxlj
— Partha Das (@partha2019LS) April 16, 2024
మరోవైపు ప్రకాశం జిల్లాలో ఓట్ల శాతం పరంగా చూస్తే టీడీపీకి 48.4 శాతం, వైసీపీకి 47.5 శాతం ఓట్లు లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇందులో పురుషుల్లో 44 శాతం వైసీపీకి, 51 శాతం టీడీపీకి జై కొట్టారు. మహిళల్లో చూస్తే వైసీపీకి 58 శాతం, టీడీపీ కూటమికి 40 శాతం మాత్రమే మొగ్గారు. సీఎంగా జగన్ కు అత్యధికంగా 47.5 శాతం, చంద్రబాబుకు 44.5 శాతం మొగ్గుచూపారు.
టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోయినా మహిళా ఓటర్లలో వైసీపీకి, పురుష ఓటర్లలో టీడీపీకి ఆదరణ లభిస్తోందని తేలింది.












Click it and Unblock the Notifications