కేసీఆర్ భయానికి పారిపోయాడు: బాబుపై పార్థసారథి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని అన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి విజయవాడకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు.

చంద్రబాబుకు దమ్ముంటే విశాఖ భూకబ్జా, అమరావతి భూముల కుంభకోణం, పోలవరం, పట్టిసీమ కుంభకోణాలు, ఉచిత ఇసుక, చెట్టు-నీరు కార్యక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని సవాల్ విసిరారు. మూడేళ్ళ క్రితం ఆయన పెట్టింది ఐదు సంతకాలు కాదని.. ఐదు వెన్నుపోట్లంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications