సిగ్గు.. లజ్జ.. ఉంటే ఇడుపాలయకు వచ్చి వెతుక్కోండి: టీడీపీకి వైసీపీ కౌంటర్
నోట్ల రద్దు అంశం కాస్త టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దానికి దారితీస్తుంది.
హైదరాబాద్ : నోట్ల రద్దు అంశం కాస్త టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దానికి దారితీస్తుంది. నేలమాళిగలో జగన్ వేల కోట్లు దాచుకున్నారని టీడీపీ పదేపదే ఆరోపిస్తుండగా.. వైసీపీ నేతలు ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా జగన్‌పై దేవినేని చేసిన పలు ఆరోపణల పట్ల స్పందిస్తూ వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి కౌంటర్ ఎటాక్ చేశారు.
ఇడుపులపాయ ఎస్టేట్ బంకర్స్‌లో జగన్ వేల కోట్లు దాచిపెట్టుకున్నారన్న దేవినేని ఆరోపణలను తిప్పికొడుతూ.. 'సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయకు వెళ్దాం.. అక్కడ ప్రతి అంగుళం వెతకండి.. అక్కడ గనుక ఏమి దొరకలేదంటే మీ నాయకుడితో క్షమాపణలు చెప్పించడానికి సిద్దమా!' అంటూ సవాల్ విసిరారు.

దివీస్ పరిశ్రమను జగన్ అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను కూడా పార్దసారథి తిప్పికొట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు తమ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని, టీడీపీ నేతలకు కప్పాలు కట్టలేకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. దివీస్ సంస్థ ఇచ్చే భూములకు ఆశపడి పేదల భూములను ఆ సంస్థకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సిద్దపడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పై ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయొద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని దేవినేనికి పార్థసారథి సూచించారు.












Click it and Unblock the Notifications