వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘లోకేష్‌లా 'పప్పు'లా జగన్ తయారు కాగలరా?’: నవ్వు ఆపుకోలేకపోయిన జగన్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైయస్సార్ కాంగ్రె పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పార్థసారథి మంత్రులు లోకేష్‌, సోమిరెడ్డిలకు ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. సోమవారం నల్లపాడులో ప్రారంభమైన వైయస్ జగన్ రైతుదీక్ష సభలో పార్థసారథి ప్రసంగం నవ్వులు పూయించింది. ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ యువ నేత లోకేష్‌కు జగన్ పోటీ కాదని వ్యాఖ్యానించారని గుర్తు చేసిన పార్థసారధి.. ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

జేసీ, కేశినేని, నారాయణ, సీఎం రమేష్, సుజనా..! బాబు తీరుపై జగన్ నిప్పులుజేసీ, కేశినేని, నారాయణ, సీఎం రమేష్, సుజనా..! బాబు తీరుపై జగన్ నిప్పులు

'జగనంట... ఏ రోజుకీ లోకేష్‌కు సమానం కాదంట. ఎట్లా సమానమవుతారండీ? లోకేష్‌లాగా, పప్పులా జగన్ తయారుకాగలరా? అని అడుగుతావున్నాను. కాలేడు. ఏనాడైనా సరే జగన్ మోహన్ రెడ్డి మైకు పుచ్చుకుని, ఈ రాష్ట్రంలో తాగునీరు లేకుండా చేయగలనని చెప్పారా? ఏరోజైనా సరే, జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పగలరా? అని అడుగుతావున్నాను' అంటూ సోమిరెడ్డికి తీవ్రమైన కౌంటర్లు ఇచ్చారు.

parthasarathi fires at lokesh and Somireddy

అంతేగాక, 'సోమిరెడ్డి గారూ... ఏరోజూ లోకేష్‌కు జగన్ సమానం కాదని చెబుతా ఉన్నాను. జగన్ కీ లోకేష్ కీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను' అని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగానికి వేదికపై కూర్చున్న జగన్ సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నవ్వులు పూశాయి.

అందుకే గుంటూరు దీక్ష: మతిమరుపంటూ బాబును ఏకేసిన వైయస్ జగన్ అందుకే గుంటూరు దీక్ష: మతిమరుపంటూ బాబును ఏకేసిన వైయస్ జగన్

రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం గుంటూరులో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

English summary
YSR Congress Party leader Parthasarathi on Monday fired at TDP ministers Nara Lokesh and Somireddy Chandramohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X