జగన్ పార్టీలో చిచ్చుపై పార్థసారథి, బిజెపిలోకి వెల్లంపల్లి

కాగా, మచిలీపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయలేనని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఇంత వరకు తనను ఆదరించిన కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థోమత తనకు లేదని, అందుకే పోటీకి, నేతలు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.
మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం స్నేహితుని నుంచి రూ 1.30 కోట్లు అప్పు తెచ్చానని, తన ఇంటిని తాకట్టు పెట్టి కూడా రూ 70 లక్షలు అప్పు తీసుకువచ్చానన్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రిలో చేర్చించానని, ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేయాలని జగన్ చెప్పారని, అందరం కష్టాల్లో ఉన్నామని, పోటీ చేయలేనని జగన్‌కు చెప్పానని తెలిపారు. అయితే, పార్థసారథి చేరికపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
బిజెపిలోకి వెల్లంపల్లి
బెజవాడలో కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్ తలిగింది. విజయవాడ పశ్చిమ శాసన సభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications