ముందుకెళ్లడం భావ్యం కాదు: టీ బిల్లుపై పార్థసారథి
గుంటూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మాధ్యమిక విద్యా మంత్రి పార్థసారథి అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి కూడా ఉన్నారు.
రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు రాజ్యాంగ నియమినిబంధనలకు విరుద్ధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ బిల్లు అసమగ్రంగా ఉందని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారని, అయినా కేంద్రం మొండి వైఖరితో ముందుకు వెళ్తామని అనడం భావ్యం కాదని ఆయన అన్నారు.

రాజ్యాంగ సవరణ ఐదు ప్రకారం పార్లమెంటుకు సుమోటాగా రాష్ట్ర విభజన చేసే అధికారం లేదని గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించే ముందు శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పారని ఆయన అన్నారు.
విభజన బిల్లును శాసనసభ తిరస్కరిస్తూ తీర్మానం చేయడాన్ని ఉత్తుత్తిదే అంటూ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications