వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..

|
Google Oneindia TeluguNews

 Participating in Telangana Survey is people's choice says High Court
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలా.. వద్దా అనేది ప్రజల ఇష్టమని హైకోర్టు పేర్కొంది. సర్వే ఐచ్ఛికమన్న ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు సర్వేలో వ్యక్తిగత వివరాలు అడిగి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. సమగ్ర కుటుంబ సర్వేపై తదుపరి విచారణ వాయిదా వేసింది.

ప్రభుత్వం చేపట్టిన సర్వే న్యాయ సమ్మతం కాదని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను ఆలకించింది.

సమగ్ర సర్వే తప్పనిసరి కాదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సర్వే స్వచ్ఛందంగానే నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలు కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని న్యాయస్థానానికి విన్నవించారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం లేదని తెలిపారు.

బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నెంబరు లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలని, వాటిని ప్రభుత్వం అడగకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. గణాంకాల చట్టం ప్రకా సర్వేకు ముందు ప్రకటన ఇవ్వాలని తెలిపారు. పన్నుల విధింపు, ప్రాసిక్యూషన్ సర్వే వివరాలు ఇవ్వకూడదని అన్నారు. సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకూడదని పేర్కొన్నారు.

English summary
High Court on Thursday said that Participating in Telangana Survey is people's choice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X