ముళ్లపొదల్లో మూడు తలలు, అవయవాలు

మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని ముళ్లపొదల్లో మానవ శరీర భాగాలు పడి ఉన్నాయి. ఆ సంఘటన పట్టణవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన మూడు తలలు, ఇతర విడిభాగాలు ప్రజలను గగుర్పాటు కలిగించాయి.

స్థానికుల సమాచారం మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ శరీర భాగాలు ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన గుర్తుతెలియని వ్యక్తులవిగా నిర్ధారించారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందినప్పుడు వారి మృతదేహాలను పోస్టుమార్టం చేసి మూడు నెలలు పాటు ఆసుపత్రిలో భద్రపరుస్తారు.

parts of dead body in Machilipatnam found

తరువాత కూడా మృతులకు సంబంధించినవారు రాకపోతే ఆ మృతదేహాలను ఆసుపత్రి వారు మున్సిపల్ అధికారుల సాయంతో ఖననం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విడిభాగాలు కూడా ఆ కోవకు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖననం చేయాల్సిన మృతదేహాల విడిభాగాలను నిర్లక్ష్యంగా బాక్సులలో పెట్టి ముళ్లపొదల్లో పడవేసి ఉంటారనే అనుమానాన్ని బందరు డిఎస్పీ వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+