పీఏ లను పెట్టుకోవాలటే చీదర..! అందుకే తన పనులు తానే చేసుకుంటానంటున్న లోకేష్..!!
అమరావతి: మంగళగిరి టీడిపి అభ్చర్థి నారా లోకేష్ నియోజక వర్గంలో పర్యటించడం ప్రారంభించేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ ప్రజల మనసు దోచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తన వద్ద పీఏ వ్యవస్థ లాంటివి ఉండవని, తన పని తానే స్వయంగా చేసుకుంటానని వివరించారు. తనకు ఎలాంటి ఫోన్ కాల్స్, మేసెజ్ లు వచ్చినా తానే స్వయంగా సమాధానం ఇస్తానని లోకేశ్ అన్నారు. అంతేకాకుండా తాను ఎల్లప్పుడు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు.
పీఏ వ్యవస్థ కారణంగా అటు నేతకు ఇటు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశముందన్నది నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు. కొందరు నేతలు కులాల ప్రస్తావన తెస్తున్నారని, కొందరు రేపు మతాన్ని, ప్రాంతాన్ని కూడా తీసుకొస్తారని విమర్శించారు. మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి అని అన్నారు.

పార్లమెంటులో మోదీ పేరు ప్రస్తావించాలంటేనే చాలామంది భయపడతారని, అలాంటిది తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్ అని మాట్లాడారని గుర్తుచేశారు. మచ్చలేని కుటుంబాలపై కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీపై పరోక్ష ఆరోపణలు చేసారు లోకేశ్.












Click it and Unblock the Notifications