సీమాంధ్ర భగ్గు: ఆ ఇద్దర్నీకలిపి ధనుమాడారు (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు (తెలంగాణ ముసాయిదా బిల్లుకు) లోకసభ ఆమోదం తెలపడంతో సమైక్యవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.

విభజనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమంటూ మండిపడ్డారు. ఉదయం నుంచి ప్రధాన కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలతో పాటు పోలీసులను మోహరించారు.

ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్య ఉద్యోగులు, కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేంద్రం దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర


లోకసభలో అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేశారని ఆరోపిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో బుధవారం సీమాంధ్ర టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, పార్టీ బంద్ నిర్వహిస్తున్నారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

రాష్ట్ర విభజన నిరసిస్తూ పలురాజకీయ పార్టీలు సీమాంధ్ర జిల్లాల్లో బుధవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాజధానినుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

అనకాపల్లిలో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను, కాంగ్రెస్ పార్జీ జెండాలను దగ్ధం చేశారు. విజయనగరం జిల్లాలో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. బిల్లుపై చర్చ లేకుండానే ఆమోదించారని టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, విశాలాంధ్ర మహాసభ నేతలు మండిపడ్డారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

మంగళవారం సాయంత్రం టిడిపి ఆధ్వర్యంలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించి సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

విజయనగరంలో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. తెలుగుదేశం పార్టీనేతలు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర సైతాన్ సోనియా గాంధీ అంటూ ఆమె ఫ్లెక్సీని తగులబెట్టారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తీరు పట్ల గోదావరి జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

ఇంత కర్కశంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో బిల్లును ఆమోదించటం అన్యాయమని సమైక్యవాదులు నిప్పులు చెరుగుతున్నారు. మోడీ ఫ్లెక్సీని చింపివేస్తున్న దృశ్యం.

సీమాంధ్ర

సీమాంధ్ర

సీమాంధ్రకు న్యాయం జరగాలంటూ గత నాలుగు రోజులుగా ప్రకటనలిచ్చిన బిజెపి విభజన బిల్లుకు ఓకె చెప్పటాన్ని సమైక్యవాదులు దుయ్యబట్టారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

సీమాంధ్ర ప్రజలు, న్యాయవాదులు, ఉద్యోగులు ఎన్నో త్యాగాలకు సిద్ధపడి చేస్తున్న ఆందోళనలను కాంగ్రెస్ అధిష్ఠానం ఏ మాత్రం పట్టించుకోలేదని సీమాంధ్ర న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

రాజమండ్రిలో సోనియాగాంధీ దిష్టి బొమ్మలను దగ్ధంచేశారు. రాజమండ్రి నగర బిజెపి పార్టీ కార్యాలయం ముందు బిజెపి జెండాలను తగులబెట్టి నిరసన తెలిపారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఎపిఎన్‌జిఒలు సోనియా, చిదంబరం, సుష్మాస్వరాజ్‌లు కలసివున్న ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బిజెపి జెండాలను సమైక్యవాదులు దగ్ధం చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మరుక్షణమే జిల్లాకు చెందిన ఏకైక మంత్రి కె. పార్థసారధి తన రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రికి పంపించారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

కృష్ణా జిల్లా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దగ్దాలతో జిల్లాను హోరెత్తించారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సిపిఎం, ఎన్‌జిఓలు, ప్రజా సంఘాలు తెలంగాణ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకించాయి.

సీమాంధ్ర

సీమాంధ్ర

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు, ఉద్యోగ సంఘాలు టిఎన్‌ఎస్‌ఎఫ్ సమైక్యాంధ్ర టీచర్ల ఫెడరేషన్, వివిధ రాజకీయపార్టీలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.

సీమాంధ్ర

సీమాంధ్ర

మరో ఐదుగురు శాసనసభ్యులు ఎటూ తేల్చుకోలేక డోలాయమానంలో ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెసు సెంట్రల్ ఇన్‌ఛార్జి వంగవీటి రాధా నాయకత్వంలో కార్యకర్తలు బందరు రోడ్డులో సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బెంజిసర్కిల్‌లో జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

సమైక్యాంధ్ర సంరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది నరహరశెట్టి శ్రీహరి నాయకత్వంలో సబ్ కలెక్టరేట్ ఎదుట సామూహిక దీక్ష చేసారు. జగ్గయ్యపేటలో సోనియా దిష్టిబొమ్మను తగులబెట్టారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ముందుగా ఊహించిందేనని, అయితే సీమాంధ్రులందరూ రాజధాని ఏర్పాటుపై ఇక దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+