మధ్యవర్తి సుజనా: బాబు, హరికృష్ణ మధ్య ప్యాచప్

పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరితో హరికృష్ణ కొద్దిసేపు మాట్లాడారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో హరికృష్ణ పాల్గొన్నప్పటికీ, బావ చంద్రబాబుతో ముభావంగానే ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటం వల్లనే హరికృష్ణ మళ్లీ టిడిపికి చేరువ కావాలని చూస్తున్నారని టిడిపి వర్గాల సమాచారం.
సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులందరిలో ఆయన రాజీనామా ఒక్కటే ఆమోదం పొందింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్లమెంటు సభ్యులు చంద్రబాబు మాట మేరకు తనను మోసం చేశారని హరికృష్ణ భావించినట్లు సమాచారం.
కాగా, అంతకు ముందు నుంచే చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. చాలా కాలంగా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరికృష్ణ మళ్లీ పార్టీలోకి రావాలని అనుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications