జగన్ దుర్మార్గ రాజకీయం
అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నష్టం పైన కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తల్లి కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ పని అయిపోతుందన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications