మాకు ఒక్క నిమిషం పని కాదు: బిజెపిపై పత్తిపాటి, జగన్ పైనా
గుంటూరు: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగడం తమకు నిమిషం పని అని మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పత్తిపాటి మాట్లాడారు.
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టి ఉంటే నేడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కోటి సంతకాలతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. బీజేపీతో టిడిపి వైదొలగితే తాము కేంద్రంలో చేరాలని వైసిపి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ ఉన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ధ్వజమెత్తారు. టిడిపికి కేంద్రం నుంచి వైదొలగడం నిమిషం పని కాదని, కానీ దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కాంగ్రెస్, వైసిపిలి నేడు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
వైయస్ జగన్ జగన్నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా విషయమపై ఓ స్పష్టత ఇవ్వాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారని చెప్పారు. త్వరలోనే కేంద్రం స్పష్టమైన ప్రకటనతో ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications