పవన్ ఇరిటేషన్ స్టార్.. బాబు ఇమిటేషన్ స్టార్; జగన్ ఇన్స్పిరేషన్ స్టార్: మంత్రి రోజా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి రోజా సెల్వమణి తేల్చిచెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రజలు హాయ్ ఏపీ.. బై బై బీపీ (బాబు, పవన్ ).. వన్స్ ఎగైన్ వైఎస్ఆర్ సీపీ అంటున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
చిత్తూరు డెయిరీకి సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పాడి రైతుల జీవితాలలో వైయస్ జగన్ వెలుగులు నింపుతున్నారని పేర్కొన్న రోజా చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు ఈ రోజు సిగ్గుపడాల్సిన రోజు అన్నారు.

ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు, ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు అంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్లీ జగన్ ను సీఎం చేయాలన్న కసితో ఉన్నారని, ఎంతమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా లాభం లేదని రోజా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి చిత్తూరు జిల్లా పర్యటన నూతన చరిత్రకి శ్రీకారం!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 4, 2023
• నేడు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్,
• రూ.385 కోట్ల పెట్టుబడితో పునరుద్దరణ పనులు,
• తొలిదశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్.. పాలు, పెరుగు,… pic.twitter.com/RY7s6CE1fp
రికార్డులు సృష్టించాలి అన్నా.. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలన్న ఆయన తప్ప వేరే ఎవరూ బ్రేక్ చెయ్య లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీని ప్రారంభిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం, తన హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని మూసివేయించారు అని మంత్రి రోజా ఆరోపించారు.
చంద్రబాబు పవన్ ఇద్దరు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు అని రోజా పేర్కొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా వాసులకు శుభ దినమని, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్ విజయ డెయిరీ కి ప్రాణం పోస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications