జగన్! ఇప్పుడు చెప్పు: ఎప్పటిలా పవన్ కళ్యాణ్ చురకలు, నిన్న.. నేడు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన గుంటూరు బహిరంగ సభలో ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ మొదలు ఓటుకు నోటు వరకు ఏకిపారేశారు. అయితే, మొదట ఆయన కాంగ్రెస్ పార్టీని, మధ్యమధ్యలో వైసీపీని ఏకిపారేశారు. గతంలో వలే జగన్‌ను విమర్శించారు.

చదవండి: ఇక 2019 అంత సులభం కాదు: నాలుగేళ్ల తర్వాత.. బాబుకు పవన్ భారీ షాక్, ఒక్కో పాయింట్‌తో ఇలా

తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై నిన్న ప్రశంసించిన పవన్, గుంటూరు సభలో కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తాననే అభిప్రాయం సరికాదని, తాను సీఎం అయితేనే సమస్యలపై కదిలానా అని జగన్‌కు కూడా కౌంటరిచ్చారు.

చదవండి: ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?

సీఎం అయితేనే సభకు వెళ్తావా

సీఎం అయితేనే సభకు వెళ్తావా

వైసీపీ అసెంబ్లీకి వెళ్లదని, మరి ప్రజల కోసం ఇంకేం పోరాడుతుందని పవన్ ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తాడా అని ప్రశ్నించారు. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించిందన్నారు. తాను సీఎం కాకపోయినా సమస్యలపై పోరాటం చేయడం లేదా అన్నారు.

జగన్! ఇప్పుడు చెప్పండి నా వెనుక బాబు ఉన్నారా?

జగన్! ఇప్పుడు చెప్పండి నా వెనుక బాబు ఉన్నారా?

తన వెనుక తెలుగుదేశం, చంద్రబాబు ఉన్నారని తనపై విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్‌కు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి నా వెనుక టీడీపీ ఉందని నమ్ముతున్నారా అని ప్రశ్నించారు. తాను చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నానంటే జగన్.. మోడీ డైరెక్షన్లో పని చేస్తున్నారా అఅని ప్రశ్నించారు.

విజయసాయికి ప్రధాని అపాయింటుమెంట్ వెనుక

విజయసాయికి ప్రధాని అపాయింటుమెంట్ వెనుక

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ వెనుక మతలబు ఏమిటని పవన్ ప్రశ్నించారు. సీఎం 29సార్లు ఢిల్లీ వెళ్తే ప్రధాని అపాయింటుమెంట్ దొరకలేదని అంటున్నారని, విజయసాయికి ఎలా దొరికిందన్నారు.

వాళ్లేం చదువుకున్నారంటే

వాళ్లేం చదువుకున్నారంటే

కాంగ్రెస్ పార్టీపై పవన్ విమర్శలు గుప్పించారు. ఇంటి పేరులో మహాత్మా గాంఎధీ ఉన్నంత మాత్రాన వాళ్లు మహాత్ములు కాలేదని పవన్ అన్నారు. నిజంగా వారిలో అదే డీఎన్ఏ ఉండి ఉంటే దేశం, రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే కాంగ్రెస్ హైకమాండోయ్ అని కాంగ్రెస్ వాళ్లు చదువుకున్నారన్నారు. విభజన తర్వాత కూడా వారిలో పశ్చాత్తాం లేదన్నారు.

ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా

ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా

కాంగ్రెస్ హయాంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా గొడవలు పెట్టారని పవన్ మండిపడ్డారు. మనం వారిని నమ్మితే తెలుగు జాతి సమగ్రతను చెడగొట్టడమే కాకుండా భారత జాతి సమగ్రతకు తూట్లు పొడిచారన్నారు. రాజకీయ జూదరులను నిలదీసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం రాలేదన్నారు. కడుపు మండి వచ్చానని చెప్పారు. ఆయన భారత్ మాతాకు జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను ప్రజల పక్షాణ నిలబడేందుకు వచ్చానని, అన్నగా, తమ్ముడిగా వచ్చానని, మీలో ఉన్న బాధే నాలో ఉందని, అదే బాధతో జనసేన పెట్టానన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With general elections just a year away, the political heat is rising in Guntur district. Leader of the Opposition and the YSRCP chief YS Jagan has already entered the district as part of his Praja Sankalpa Yatra and is drawing huge crowds.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి