జనసేన అభ్యర్థులను ఎన్నుకోండి: మార్పు కోసమే పోరాటమన్న పవన్ కళ్యాణ్, బీజేపీ అభ్యర్థులకూ మద్దతు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోందన్నారు.
జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు.

స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందన్నారు పవన్ కళ్యాణ్. జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. మన బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. మిత్ర పక్షం బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
కాగా, నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు నవంబర్ 15న నిర్వహించే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితోపాటు మరికొన్ని పురపాలక, నగర పాలక బసంస్థల్లోనూ, ప్రజా పరిషత్తుల్లో వచ్చిన ఉపఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచిందని తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డిపాళెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలతోపాటు విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్లు, రేపల్లె మున్సిపాలిటీల్లో ఉపఎన్నికలు, పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications