వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమే పునాది, మా వేదన అర్థం కాదా?: బీజేపీ ఎంపీపై పవన్ ఫైర్, పార్టీలకు పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారతీయ జనతా పార్టీ ఎంపీ తరుణ్ విజయ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణ భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరుణ్ విజయ్.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఆరోజే సదరు ఎంపీకి వ్యాఖ్యలపై మండిపడిన పవన్.. మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

'దక్షిణ భారతీయులపై బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. దీంతోనే అర్థమవుతుంది ఉత్తర భారత రాజకీయ నాయకుల, మేధావుల సంస్కారం ఎలాంటిదో. ఒకవేళ తరుణ్‌విజయ్‌, ఆయన పార్టీ నేతలు నిజంగా తమ చర్యలకు క్షమాపణ చెప్పాలని భావిస్తే.. వారు మన ద్రవిడ భాష ఒక్కటైనా నేర్చుకోవాలి. అప్పుడే మనల్ని ఎంత వేదనకు గురిచేశారో వారికి అర్థమవుతుంది' అని పవన్‌ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

'బీజేపీ నాయకత్వానికి, తరుణ్‌ విజయ్‌కు నేనొక్కటే చెబుతున్నా.. మేం ఈ దేశానికి కిందభాగంలో ఉన్నాం. ఈ దేశానికి పునాది మేమే. అంతేగానీ మీ ఉత్తరభారత నాయకత్వం కాదు' అని వ్యాఖ్యలు చేశారు పవన్‌కల్యాణ్‌.

'ఓ రాష్ట్రం, అక్కడ ప్రజల అభివృద్ధి గురించిన విషయాల్లో అన్ని పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా ఒకతాటిపై కలిసి నడవాలి. ప్రస్తుతం ఉత్తర భారత కుట్ర నాయకత్వాన్ని ఎదిరించాలంటే దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఏకమవ్వాలి' అని పవన్‌ అన్ని పార్టీల రాజకీయ నేతలకు పిలుపునిచ్చారు.

అంతేగాక, ఓ ఇంగ్లీష్ డెయిలీలో సీపీఐ నారాయణ కథనాన్ని కూడా పవన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తరుణ్ వ్యాఖ్యలతో ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించాలని బీజేపీ అనుకుంటున్నట్లు తెలుస్తోందని ఆ కథనంలో నారాయణ పేర్కొన్నారు. కాగా, నారాయణ వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు వపన్ కళ్యాణ్ ఆ పోస్టును ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు.

దక్షిణ భారతీయులను రంగు, భాషలను బట్టి వివక్షపూరితంగా చూస్తున్నారని, అంతేగాక, పార్లమెంటు దాడులు కూడా చేశారని వ్యాఖ్యానించారు. అయినా భరించామని అన్నారు. కేవలం తమ ప్రజల ఆత్మ గౌరవం కోసమే ఇవన్ని చేస్తున్నామని అన్నారు. మా కాంట్రాక్టులు, బిజినెస్ అవకాశాలు కూడా తిరస్కరించవచ్చని, దీంతో స్కాంలు, తప్పులు చేయడం నుంచి బయటపడతామని అన్నారు.

English summary
Jana Sena Party president Pawan Kalyan on Thursday fired at BJP MP Tarun Vijay for his comments on South Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X