విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహస్య స్నేహితుడు-ఆట అప్పుడు మొదలు: పవన్ వ్యాఖ్యల్లో నిజమెంత, జగన్ చేసిందేంటి?

టిడిపికి తాను రహస్య స్నేహితుడిని అంటున్న వైసిపికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధికి అండగా ఉంటానని, అలాగే ఇష్యూ బేస్డ్‌గా మాట్లాడుతానని పునరుద్ఘాటించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపికి తాను రహస్య స్నేహితుడిని అంటున్న వైసిపికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధికి అండగా ఉంటానని, అలాగే ఇష్యూ బేస్డ్‌గా మాట్లాడుతానని పునరుద్ఘాటించారు.

చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ ఓ లెక్కా! బయటికే చెప్తా

తెలుగుదేశం పార్టీ ఓ లెక్కా! బయటికే చెప్తా

తన సొంత అన్నయ్యనే ప్రజల కోసం పక్కన పెట్టానని, ఇక తెలుగుదేశం పార్టీ ఎంత అని, తనకు రహస్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని, 2014లో బాహాటంగా మద్దతిచ్చానని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఆయన చెప్పిందాంట్లో వాస్తవం ఎంత, అసలు ప్రత్యేక హోదా వంటి అంశాలపై జగన్ చెప్పిందేమిటి, చేస్తుందేమిటి అనే చర్చ సాగుతోంది.

Recommended Video

Pawan Kalyan to be the Brand Ambassador of ‘AP Jeevan Dan’ Program
ఒకటే లక్ష్యం

ఒకటే లక్ష్యం

తాను అంశాలవారీగా మద్దతు పలుకుతానని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అందులో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు తీర్చడమే తన లక్ష్యమని అభిప్రాయపడ్డారు. ఉద్ధానం దశాబ్దాలుగా అక్కడి ప్రజలను వేధిస్తోన్న అంశం. దీని కోసం ప్రభుత్వంతో మాట్లాడటం తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు విమర్శల కంటే సమస్యల పరిష్కారం కావాలని చెప్పారు. అధికార పక్షమో, ప్రతిపక్షమో.. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి నడిస్తే తప్పేమిటనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

విమర్శలూ ఉన్నాయి

విమర్శలూ ఉన్నాయి

పవన్ కళ్యాణ్ అలా చెబితే.. టిడిపికి మద్దతుగా మాట్లాడినట్లుగా భావించవద్దని అంటున్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన చంద్రబాబుకు చురకలు అంటించారు. అక్వా ప్రాజెక్టు పైన విమర్శలు గుప్పించారు. అయితే ఉద్ధానం వంటి సీరియస్ అంశంపై మాట్లాడటానికి వచ్చినందున.. ఆయన ఈ అంశాలపై కటువుగా మాట్లాడలేదని అంటున్నారు.

బీజేపీ కోసం ఉవ్వీళ్లూరుతూ పవన్ కళ్యాణ్‌ను విమర్శించడమా

బీజేపీ కోసం ఉవ్వీళ్లూరుతూ పవన్ కళ్యాణ్‌ను విమర్శించడమా

వైసిపి అధినేత జగన్ ఇటీవల బిజెపితో కలిసేందుకు ఉవ్వీళ్లూరుతున్నట్లుగా అందరికీ కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి వైసిపికి రహస్య స్నేహితుడు అని పవన్‌ను విమర్శించే హక్కు లేదంటున్నారు. జనసేనాని ఏదయినా సూటిగా చెబుతున్నారని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి కోసం అండగా నిలబడితే తప్పేమిటంటున్నారు.

ప్రత్యేక హోదా- జగన్ ఇలా, పవన్ కళ్యాణ్ అలా

ప్రత్యేక హోదా- జగన్ ఇలా, పవన్ కళ్యాణ్ అలా

ప్రత్యేక హోదా విషయంలోనే ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే తెలిసిపోతుందని చాలామంది గుర్తు చేస్తున్నారు. హోదాపై తాను తగ్గలేదని పవన్ చెప్పారు. జగన్ కూడా ఇదే మాట చెప్పినప్పటికీ ఆయన వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. హోదాపై తనకు తానే జగన్ ఈ పార్లమెంటు సమావేశాల్లో తమ ఎంపీలు రాజీనామా చేస్తారని డెడ్ లైన్ విధించుకున్నారు. కానీ ఆ తర్వాత రాజీనామాల గురించి అడిగితే, ఇప్పుడు కాకుంటే తర్వాత అన్నారు.

అసలైన రాజకీయ నాయకుడిగా..

అసలైన రాజకీయ నాయకుడిగా..

పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని వేర్వేరుగా చూస్తున్నారని అంటున్నారు. అందుకే కాపు, అక్వా అంశాలపై విమర్శలు గుప్పించి, ఉద్ధానం సమస్యపై అండగా ఉంటానని చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. మీరు రాజకీయ నాయకుడా, ప్రజా నాయకుడా అని ప్రశ్నిస్తే.. నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని పవన్ చెప్పారు. పేరు ఏదైనా అసలైన రాజకీయ నాయకుడి లక్షణం ఇదేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

జగన్‌కు ఆ దమ్ముందా

జగన్‌కు ఆ దమ్ముందా

ప్రత్యేక హోదాతోనే ఏపీ ముందుకెల్తుందని చెప్పిన జగన్, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు, హోదాపై ఎందుకు మౌనం వహస్తున్నారో చెప్పాలంటున్నారు, పొడి పొడి మాటలు కాదు.. దమ్ముంటే సభలు పెట్టాలని, పాదయాత్రలో హోదా కోసం గట్టి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా చెప్పాలని అంటున్నారు.

ఆట మొదలవుతుందిగా..

ఆట మొదలవుతుందిగా..

జగన్ అక్టోబర్ 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పవన్ కూడా తాను అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వైఖరి అప్పుడు స్పష్టమవుతుందంటున్నారు. హోదా కోసం రాజీనామాలు అని చెప్పి, ఆ తర్వాత మోడీకి భయపడి వెనక్కి తగ్గిన వైసిపికి పవన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని కొందరు అంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ జీవన్ ధాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధమన్నారు. అంతకుముందు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారు.

English summary
Actor politician Pawan Kalyan met Andhra Pradesh chief minister Chandrababu Naidu on monday to discuss about the kidney related diseases in the Uddanam region of Srikakulam district in Andhra Pradesh. Later they had a meeting with a Harvard team and the expert doctors team of AP who did research on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X