Pawan Kalyan: చంద్రబాబు బెయిల్ పై పవన్ రియాక్షన్ ఇదే-కీలక పిలుపు..!
ఏపీలో సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ మధ్యంతర బెయిల్ లభించింది. కంటి సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు కూడా ఊరట నిచ్చింది. దీంతో జనసేన పార్టీ ఛీప్ పవన్ కళ్యాణ్ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్పందించారు.
చంద్రబాబుకు బెయిల్ లభించిందని తెలియగానే పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ తెలిపారు.

ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. చంద్రబాబు నాయుడు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం. అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో టీడీపీ, జనసేన ఇరు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన పవన్.. ఆ దిశగా ఇరు పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయించారు. ఈ కమిటీల రాష్ట్రవ్యాప్త సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ రావడం ఇరు పార్టీలను సంతోషంలో ముంచెత్తింది.












Click it and Unblock the Notifications