అన్నయ్యకు చెప్పా, అహంకారం తీసేశా, బీజేపీ హిందూ మతానికి: పవన్ కళ్యాణ్ నోట సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: తాను 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం చెప్పారు. ఆయన ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలతో విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

మీకు హక్కులేదు, జైలుకెళ్తా, లాఠీ దెబ్బలు తింటా, మోడీని ఏదీ అడగలేదు, నా సత్తా చూపిస్తా: ఊగిపోయిన పవన్

దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రక్తం కావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. చిన్న విత్తనమే మహా వృక్షం అవుతుందన్నారు. కార్యకర్తలు అందరూ మహా వృక్షాలు అవుతారనే నమ్మకం ఉందని చెప్పారు. మనది వసుదైక కుటుంబమని, మన కుటుంబం చాలా పెద్దది అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు రావాలన్నారు.

  Pawan Kalyan Warns Centre Over DCI and angry on YS Jagan

  జగన్! అది మానుకో: పవన్ దిమ్మతిరిగే షాక్, 'సీఎం' నినాదాలతో అసహనం, సంతోషం లేదని..

  తాను సరదాకు పార్టీ పెట్టలేదు

  తాను సరదాకు పార్టీ పెట్టలేదు

  ప్రజా సమస్యలపై పోరాడేందుకే తాను జనసేన పార్టీని పెట్టానని, సరదాకు పెట్టలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్నాళ్ల క్రితం సత్యాగ్రహి సినిమా కోసం కథ రాసుకున్నానని చెప్పారు. సినిమాల వల్ల వ్యవస్థలు మారవని చెప్పారు. ఎవరైనా తాము ఆచరించి ఇతరులకు చెబితే అర్థం, విలువ ఉంటుందన్నారు.

  సత్యాగ్రహి కథ రాసుకున్నా

  సత్యాగ్రహి కథ రాసుకున్నా

  తాను రాసుకున్న సత్యాగ్రహి కథనే నిజరూపంలో ఎందుకు కాకూడదని అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నా వల్ల సమూల మార్పులు రాకపోవచ్చునని, కానీ ఎంతోకొంత మార్చగలమని అన్నారు. రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  సినిమాలు హిట్టయినా ఆనందం లేదు

  సినిమాలు హిట్టయినా ఆనందం లేదు

  2003లోనే తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, ఆ విషయం తన తల్లి, తండ్రి, అన్నయ్య చిరంజీవికి చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాలు హిట్టయినా తనకు ఎలాంటి సంతోషం లేదని చెప్పారు. ఆత్మ సంతృప్తి కావాలన్నారు. నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నారు.

  ఈ పార్టీలు సరిపోవు

  ఈ పార్టీలు సరిపోవు

  ఒక దేశానికి ఒక నది సరిపోదని ఓ కవి చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్‌లే స్ఫూర్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సరిపోవని చెప్పారు. బ్రిటిష్ ఇండియా నుంచి బ్రిటిష్‌ను మహాత్మా గాంధీ తొలగించారన్నారు.

  బీజేపీ హిందూమతానికి, జాతీయ భావాలు గల పార్టీ కావాలి

  బీజేపీ హిందూమతానికి, జాతీయ భావాలు గల పార్టీ కావాలి

  బీజేపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరు అనుకునేదే అయినప్పటికీ పవన్ నోట రావడం గమనార్హం. బీజేపీ కేవలం హిందూమతానికే పరిమితమైందని చెప్పారు. ఒక్కొక్క పార్టీ ఓ కులానికి, మతానికి పరిమితమైందన్నారు. జాతీయ భావాలు ఉన్న పార్టీ రావాలని చెప్పారు.

  అహంకారం తొలగించాను

  అహంకారం తొలగించాను

  నాలో నుంచి నేను అహంకారాన్ని తొలగించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను అనేపదాన్ని ప్రజా సమస్యలపై పోరాడే సమయంలోనే వాడుతానని చెప్పారు. ఒక కొత్త యువరక్తం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో అశోక్ గజపతి రాజు లాంటి రాజులు, సంస్థానాలు ఉండేవని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Pawan Kalyan attacks BJP in his Vishakhapatna tour. He talks about his political entry.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి