పవన్ ఒక్కడి స్పీచ్!: 5.30కు గేట్లు క్లోజ్, భారీ భద్రత

 Pawan Kalyan to be lone speaker at launch
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు తన రాజకీయ పార్టీని మాదాపూర్‌లోని ఓ హోటల్లో ప్రకటించనున్నారు. పార్టీ ప్రకటన సమయంలో పవన్ ఒక్కరే మాట్లాడనున్నారు. ఆయన 45 నిమిషాలు పార్టీ విధివిధానాలు, తన వ్యక్తిగత విషయాల పైన మాట్లాడనున్నారు. తాను ఏం చేయనున్నానో చెప్పనున్నారు.

పార్టీ ప్రకటన సమయంలోను మరెవరు మాట్లాడరని తెలుస్తోంది. ఆయన మాట్లాడగానే ముగియనుంది. కాగా, పవన్ పార్టీ ప్రకటన కోసం మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్ సిద్ధమవుతోంది. దాదాపు ఆరువేల మంది అభిమానులు హాజరుకానున్నారు. ఇప్పటికే అరేంజ్‌మెంట్స్ దాదాపు పూర్తయ్యాయి.

పవవ్ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇమేజ్ గార్డెన్ వద్ద భారీ ఎత్తున ప్రయివేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. 300 మంది ప్రయివేటు సెక్యూరిటీ, 200 మంది పోలీసులను ఉంచారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి వేదికను తయారు చేస్తున్నారు. ఆయన పలు చిత్రాలతో పాటు పలు ఈవెంట్లలో వేదికలను డిజైన్ చేశారు.

పవన్ పార్టీ ప్రకటనకు పెద్ద ఎత్తున అభిమానులు, ముఖ్యులు రానున్నారు. ఇందుకోసం హోటల్లో మూడు గదులను కంబైన్డ్ చేశారు. అదే సమయంలో పవన్ పార్టీ ప్రకటన సమయంలో క్రమశిక్షణగా ఉండాలని సందేశం పంపించారట. ఆరున్నర గంటలకు పవన్ మీడియా సమావేశం ఉంటుంది. ఐదు గంటల వరకే పవన్ అభిమానులు రావాల్సి ఉంది. ఐదున్నర గంటలకు గేట్లు క్లోజ్ చేస్తారు. కాగా, పవన్ సమావేశానికి 500 మంది ప్రముఖులకు, 2,500 మంది అభిమానులకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం.

పవన్ కార్యాలయం ఎమ్మెల్యే కాలనీలో

జనసేన పార్టీ కోసం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొన్నట్లు తెలిసింది. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో తను నివసిస్తున్న ఇంటిని చిరునామాగా అందులో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీని కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు అందులో తెలిపారు. పవన్‌ ఈ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

కార్యదర్శి, కోశాధికారి, మరో ముగ్గురు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తారని ఎన్నికల సంఘానికి తెలిపారు. అయితే ప్రస్తుతం చెప్పిన చిరునామాలో పార్టీ కార్యాలయం ఉండకపోవచ్చని సమాచారం. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ పరిసరాల్లో విశాలమైన ప్రాంగణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని స్థలాల్నీ, భవనాల్నీ పరిశీలించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+