• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాట తీస్తాం..! చేత కాక కాదు..! త‌రిమికొడ‌తాం..!! అనే ప‌వ‌న్ ఎందుకు సైలెంటయ్యారు.??

|

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఆవేశంతో ఊగి పోవ‌డం.. శూలాల్లాంటి మాట‌ల‌ను ప్ర‌త్యర్థుల గెండెల్లో గుచ్చ‌డం, అశేష జ‌న‌వాహిని సాక్షిగా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. ఇవ‌న్నీ జ‌న‌సేన అద్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేన‌రిజ‌మ్స్ గా చెప్పుకుంటారు. అందుకు పూర్తి వురుద్దంగా ప‌వ‌న్ వ్య‌వ‌మ‌రించడం ఎవ‌రికి న‌చ్చ‌డం లేదు. ప్ర‌త్య‌ర్తి పార్టీ నేత‌లు ప‌వ‌న్ అంత‌ర్గ‌త విష‌యాల జోలికి వ‌చ్చినా ఎందుకు సంయ‌మ‌నం పాటిస్తున్నార‌ని త‌మ‌లో తాము ప్ర‌శ్నించుకుంటున్నట్టు తెలుస్తోంది. గ‌తంలో తెలుగుదేశం నాయ‌కులు ఎవ్వ‌రూ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి స్పందించాలంటే కొంత ఆలోచించేవారు. టీడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే ప‌వ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చే వారు. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితులు ఎందుకు మారాయి..? అందుకు జ‌న‌సేనాని సౌమ్యంగా మారిపోవ‌డ‌మే కార‌ణ‌మా.?

దూకుడు త‌గ్గించిన ప‌వ‌న్..! ఆరోప‌ణ‌ల డోస్ పెంచిన ప్ర‌త్య‌ర్థి పార్టీలు..!!

దూకుడు త‌గ్గించిన ప‌వ‌న్..! ఆరోప‌ణ‌ల డోస్ పెంచిన ప్ర‌త్య‌ర్థి పార్టీలు..!!

జన‌సేనాని ఎందుకు సైలెంట్ అయ్యాడు. అది వ్యూహాత్మ‌క‌మా.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఇచ్చిన అవ‌కాశ‌మా.! కానీ.. ఏదో జ‌రుగుతోంది.. బ‌య‌ట‌కు క‌నిపించ‌ని మ‌రో కోణం ఇంకేదో దాగుంది. గ‌తంలో ఉన్నంత దూకుడుగా ఎందుకు ఉండ‌లేక‌పోతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో సుడిగాలిగా మారాల్సిన ప‌వ‌న్ మౌనంగా ఎందుకు ఉన్నాడు. ఎన్నో సందేహాల‌కు.. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న కీల‌కం కానుంది. ఏడాది కాలంలో టీడీపీ. జ‌న‌సేన మ‌ద్య మాట‌ల యుద్దం మొద‌లైంది.ప‌వ‌న్ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌య్యానంటూ ప్ర‌క‌టించ‌గానే విప‌క్షాల‌కు బోలెడు అస్త్రాలు అందించ్చిన‌ట్ట‌యింది. చిరంజీవి దారిలోనే ప‌వ‌న్ కూడా కొన్ని సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతాడ‌నే లెక్క‌లు వేస‌కున్నారు ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు.

 గ‌బ్బ‌ర్ సింగ్ ఎందుకు మారిపోయాడు..! మాట‌ల తూటాల‌కు తుప్పు ప‌ట్టిందా..?

గ‌బ్బ‌ర్ సింగ్ ఎందుకు మారిపోయాడు..! మాట‌ల తూటాల‌కు తుప్పు ప‌ట్టిందా..?

అయితే ప‌వ‌న్ మాత్రం తాను నెగ్గినా నెగ్గ‌క‌పోయినా, ప్ర‌త్య‌ర్థిని మాత్రం ఓడించ‌గ‌ల‌నంటూ స‌వాల్ విసిరాడు. అదే ఊపులో ఉత్త‌రాంద్ర‌, గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించాడు. అనంత‌పురం, క‌డ‌ప‌ల్లోనూ రెండ్రోజులు తిరిగాడు. తాను వెళ్లిన ప్ర‌తిచోట జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. వాస్త‌వానికి 175 చోట్ల అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. అటువంటిది జ‌న‌సేన‌కు ఎలా సాధ్య‌మ‌నే ప్రశ్న‌లు త‌లెత్తాయి. అయితే వైసీపీ ఓట్ల‌ను చీల్చేందుకు టీడీపీ ఆడుతున్న డ్రామాగా జ‌గ‌న్ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుంది. టీడీపీ కూడా ప‌వ‌న్ మా వాడేనంటూ ఊద‌ర‌గొడుతుంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పొత్తు విక‌టించ‌టంతో చంద్ర‌బాబు మ‌రోసారి ప‌వ‌న్‌నే న‌మ్ముకునేందుకు వ్యూహ‌ర‌చ న‌చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దాన్ని బ‌ల‌హీనంగా తీసుకుంటున్నారా..! కాట‌మ‌రాయుడు మ‌న‌సులో ఏముంది..?

వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దాన్ని బ‌ల‌హీనంగా తీసుకుంటున్నారా..! కాట‌మ‌రాయుడు మ‌న‌సులో ఏముంది..?

అయితే గతంలో టీడీపీతొ జ‌న‌సేనాని క‌ల‌వటాన్ని అంగీక‌రించిన కాపులు ఈ సారి మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు. వంగ‌వీటి రాధా వైసీపీ నుంచి టీడీపీకు వెళ‌తార‌నే ప్ర‌చారంతో చాలామంది కాపునేత‌లు రాధాపై నిప్పులు చెరుగుతున్నారు. ముద్ర‌గ‌డ‌, వంగ‌వీటి రాధాను పోలీసులు చుక్క‌లుచూపిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అర్ద‌రాత్రి పోలీస్‌స్టేష‌న్‌లో ఉంచ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. అయితే, జ‌న‌సేన‌లోకి వ‌స్తే వంగ‌వీటిని ప‌వ‌న్ స్వాగ‌తిస్తాడా అనే ప్రశ్న కూడా ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఇప్ప‌టికే జ‌న‌సేన ఒక కుల‌పార్టీ అంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు ముద్ర‌వేస్తూనే ఉన్నాయి. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌వ‌న్ కూడా ఇత‌ర కులాల‌కు పార్టీలో ప్రాధాన్య‌త‌నిస్తున్నారు.

టీడిపి నేత‌ల వ్యాఖ్య‌ల‌కు రియాక్ష‌న్ ఏది..? మారిన జ‌న‌సేనాని వ్యూహం..!!

టీడిపి నేత‌ల వ్యాఖ్య‌ల‌కు రియాక్ష‌న్ ఏది..? మారిన జ‌న‌సేనాని వ్యూహం..!!

ఓ వైపు టీడీపీ, మ‌రో వైపు వైసీపీ, అంత‌ర్గ‌తంగా పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితులు జ‌న‌సేనానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. త‌న చుట్టూ ఎలాంటి రాజ‌కీయ ప‌ద్మ‌వ్యూహం నిర్మించ‌బుతుంద‌నే ఆందోల‌న‌లో జ‌న‌సేనాని ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీట‌న్నింటినీ ఎదుర్కొని. ప‌రిస్థితుల‌ను ఎలా అధిగ‌మిస్తార‌న్న‌ది జ‌న‌సేన‌లో ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ప‌వ‌న్ ఆవేశంగా మాట్లాడిన‌ప్పుటి ప‌రిస్థితుల‌కు. ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌న‌సేన మ‌ళ్లీ జ‌నంలో నానాలంటే. ప్ర‌త్య‌ర్థులు అవాకులు చ‌వాకులు పేల‌డం ఆపాలంటే ప‌వ‌న్ తాట తీసే భాష‌ను మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీయ‌ల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

English summary
TDP, on the other hand, the YCP, the situation inherent in the party seems to be joking in Janasena. There seems to be a lot of hindrances about the political prediction building around Pawan kalyan. All this has happened. How to overcome the situation has become questionable in the Janasena party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X