పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా - అసలు కారణం అదేనా..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని గతంలో జనసేనాని నిర్ణయించారు. యాత్రకు ఏర్పాట్లు చేసారు. ఇందు కోసం ఒక బస్సు కూడా పవన్ కోసం సిద్దం చేసారు. కానీ, ఈ యాత్ర వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం పవన్ బస్సు యాత్ర గురించి పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసారు. అక్టోబర్ 5 నుంచి పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు.

ఎన్నికల వరకు ప్రజల్లోనే
అ సమయంలోనే ..ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండేలా జిల్లాల పర్యటన ఉంటుందని వెల్లడించారు. వచ్చే వేసవి వరకు మొత్తం 26 జిల్లాల్లోనూ పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ, దీని పైన కొద్ది రోజులు పార్టీలో చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమనే అంచనాతో జనసేనాని బస్సు యాత్రకు ప్లాన్ చేసారు.
కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించటం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో..ఇప్పుడు బస్ యాత్ర ఆరు నెలల పాటు చేసినా.. ఎన్నికలకు దాదాపుగా ఇంకా ఏడాది సమయం ఉంటుంది. దీంతో..ఇప్పుడు బస్సు యాత్ర చేయటం కంటే.. మరి కొంత కాలం ఆగి ప్రజల్లోకి వెళ్లటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ నేతలు చెబుుతున్నారు.

బస్సు యాత్ర..ఎన్నికల ప్రచారం
దీంతో..మరి కొంత కాలం ఆగి యాత్ర ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం పార్టీ నేతలు బస్సును సిద్దం చేసారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యాలయం వద్ద ఈ బస్సులో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు..పవన్ అభిమానులు తమ నేత జిల్లాల పర్యటనకు వస్తున్నారనే ఉత్సహంతో ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎప్పటి నుంచి ఈ యాత్ర పైన 18వ తేదీన జరిగే పార్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం
వచ్చే ఏడాది జూన్ లోగా పవన్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకొని..ఇక పూర్తి సమయం రాజకీయంగా పార్టీకి కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బస్సు యాత్ర తరువాత కూడా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారని పార్టీ నేతల సమాచారం. బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటారని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications