Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపటినుండి ఏపీలో పవన్ కళ్యాణ్ బిజీ; 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభ.. షెడ్యూల్ ఇదే!!

రేపటి నుండి పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు. ఆయన వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ప్రకటించింది జనసేన.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీ తో పొత్తులతో ఎన్నికలకు వెళ్లి అధికార పార్టీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటినుంచే ప్రజల బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించడానికి రెడీ అయ్యారు.

వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కళ్యాణ్

వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కళ్యాణ్

మచిలీ పట్నం సభ ద్వారా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తారని, వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో ఇప్పటం సభకు ఇచ్చినట్టే 100 ఎకరాల భూమిని సభ నిర్వహణ కోసం మచిలీపట్నం రైతులు ఇచ్చారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకట్టుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభను వేదికగా చేసుకోనున్నారు. వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్ళనున్నారు.

 ఏపీలో పవన్ పర్యటన షెడ్యూల్ ఇలా

ఏపీలో పవన్ పర్యటన షెడ్యూల్ ఇలా

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఇప్పటికే సభ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ రేపటినుండి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ వివరాల్లోకి వెళితే ఈనెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే బీసీ సదస్సులో పాల్గొంటారు. ఈనెల 12వ తేదీన కాపు ఉద్యమ నేత హరి రామ జోగయ్య, కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడనున్నారు.

13 న గవర్నర్ తో భేటీ, 14 న ఆవిర్భావ సభ

13 న గవర్నర్ తో భేటీ, 14 న ఆవిర్భావ సభ

13వ తేదీన పవన్ కళ్యాణ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. ఇక 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్లనున్నారు. నాలుగు రోజులపాటు బిజీబిజీ కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన సాగనుంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగింది. జనసేన పార్టీలో ప్రజలు క్రియాశీల సభ్యత్వాలను తీసుకున్నారు.

10 కమిటీలను వేసి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన

10 కమిటీలను వేసి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన

ఇక ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న సభ కోసం, సభా కార్యక్రమాలను నిర్వహించడానికి, సభకు తరలివచ్చే శ్రేణులు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి మొత్తం 10 కమిటీలను వేసి ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు సభకు తరలి వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

 మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ

మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ


పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై పదేపదే విమర్శలు చేసిన, ఏపీలో తిరగనివ్వం అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరగనున్న నేపథ్యంలో, అదే వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో అడుగుపెట్టనుండటం ప్రస్తుతం అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. మచిలీపట్నం కేంద్రంగా ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠకు వేదికగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+