పవన్ కళ్యాణ్ పిలుపుతో సోషల్ మీడియాలో జనసేన రచ్చ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసిపికి ప్రతిపక్ష టిడిపి, జనసేన లకు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వదలకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న తీరు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జగనన్న కాలనీలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో జగనన్న కాలనీలలో పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని, పేదలకు పట్టాలు ఇచ్చి అక్కడ జగనన్న కాలనీలుగా మార్చిన ప్రభుత్వ నిర్వాకం వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో ప్రజలకు చేర్చాలని సంకల్పించిన జనసేనాని పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ కు పిలుపునిచ్చారు.

pawan8

ఈ క్రమంలోనే నేడు జనసేన నేతలు అనేక ప్రాంతాలలో జగనన్న కాలనీలలో పర్యటిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం జగనన్న కాలనీలో పరిస్థితి పై సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్న జనసేన వీడియోలు, ఫోటోలకు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించాలని సూచించారు. నియోజకవర్గాలు, గ్రామాల వారీగా వివరాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఇవ్వాలని పేర్కొన్నారు.


ఈ క్రమంలో నేడు జనసైనికులు రంగంలోకి దిగారు. పవన్ పిలుపు మేరకు జగనన్న కాలనీలను సందర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగనన్న కాలనీ దుస్థితి ఇది అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేశారు.


అంతేకాదు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం జగనన్న కాలనీ దుస్థితిని వీడియో తీసి పోస్ట్ చేశారు జనసేన నాయకులు. ఇలా ఈ రోజంతా జనసేన నేతలు జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఈ రోజు జనసేన ఎంత రచ్చ చేస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+