ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ చూపించిన ఫ్యాన్స్..పవన్ కల్యాణ్ షాకింగ్ రియాక్షన్
ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. పోలింగ్ తేదీ దగ్గరపడటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక పార్టీల అధినేతలు సైతం అభ్యర్థుల తరుఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి వెనిగాళ్ల రాముకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కొడాలి నాని నోరు మూయించాలంటే గుడివాడలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వెనిగాళ్ల రామును గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా అందరు రాజకీయాల్లో రాణించలేరని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను టీడీపీకి మద్దతుగా నిలిచింది.. జనసేన భవిష్యత్తు కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ తెలిపారు. పవన్ ప్రసంగిస్తోన్న సమయంలో సభకు వచ్చిన కొంతమంది ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫ్లకార్డులతో హల్ చల్ చేశారు. అభిమానులు ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి ఎత్తి చూపించారు.

దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ..నాకు ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ కనిపిస్తున్నాయని..అభిమానులకు నా ధన్యవాదాలు అని పవన్ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు ఇటీవల టీడీపీ సభలో కూడా సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అక్కడితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.












Click it and Unblock the Notifications