పవన్‌‌పై వర్మ సంచలనం: దమ్ము, ధైర్యముంటే రజనీకాంత్ మాదిరిగా, లేకపోతే అవమానమే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో జనసేన చీప్ పవన్ కళ్యాణ్‌ను పోలుస్తూ సినీ దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ తాజాగా పోస్టు పెట్టాడు. రజనీకాంత్ తరహలో పవన్ కళ్యాణ్ కూడ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. అలా చేయకపోతే పవన్‌కు దమ్ము, ధైర్యం లేదని అనుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

  నేను గే కాదు.... కానీ పవన్ కళ్యాణ్‌‌నే నా ఆప్షన్ !

  'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై', అవసరాలు మారుస్తాయి: కెసిఆర్- పవన్ భేటీపై రామ్‌గోపాల్ వర్మ సంచలనం

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలకు, సంచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సినీ నటుడు పవన్ కళ్యాణ్ సమావేశం కావడంపై సంచలన పోస్టు పెట్టాడు.

  గతంలో ఇద్దరి మధ్య సాగిన మాటల యుద్దాన్ని ఆయన ప్రస్తావించారు. అవసరాల మేరకు రాజకీయ నేతలు ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ఆ పోస్టులో ప్రస్తావించారు. తాజాగా అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు.

  అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి

  అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అదే తరహలో పవన్ కళ్యాణ్ కూడ అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచించారు. వర్మ చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

  దమ్ము,ధైర్యం లేదని

  దమ్ము,ధైర్యం లేదని

  అలా చేయకపోతే రజనీకాంత్‌లో ఉన్న దమ్ము, ధైర్యం లేవని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తారని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని రామ్ గోపాల్ వర్మ స్వాగతించారు. తమిళ ప్రజలంతా ఆయనకే ఓటేస్తారని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే రజనీకాంత్ తరహలోనే పవన్ కళ్యాణ్ కూడ అన్ని స్థానాల్లో పోటీ చేయకపోతే రజినీకాంత్‌లో ఉన్న దమ్ము, ధైర్యం పవన్‌లో లేవని ఆయన అభిమానులు భావిస్తారు. ఒకవేళ రజినీకాంత్‌లా కాకుండా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం అది మన తెలుగువారి ప్రతిష్టకే అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  రజనీకాంత్‌పై పోటీ చేయడం దండగ

  రజనీకాంత్‌పై పోటీ చేయడం దండగ

  రజనీకాంత్‌పై పోటీ చేయడం దండగ అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమిళ ప్రజలు తమ గౌరవాన్ని కోల్పోయారని, అది రజనీ తీసుకొస్తానని చెప్పడం గొప్ప విషయమని ప్రశంసించాడు.

  వర్మ కామెంట్ పై నెటిజన్ల స్పందన

  వర్మ కామెంట్ పై నెటిజన్ల స్పందన

  రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.పవన్ కళ్యాణ్‌ అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తున్నారు. అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆయన అభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tollywood director Ram Gopal varma Wish that Janasena Chief Pawan Kalyan will contest all seats in Andhra Pradesh like Rajinikanth doing in Tamilnadu.If he doesn't do like Rajinikanth's fans will feel he doesn't have guts like Rajinikanth.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి