సిద్ధార్థనాథ్ గారూ! ఒక్క ప్రశ్న, ఎంతో అనుభవం: బీజేపీకి పవన్ కళ్యాణ్ కౌంటర్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్‌కు బుధవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్‌కు బుధవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్క ప్రశ్నే అడుగుతున్నానంటూ.. నోట్ల రద్దు తర్వాత వరుసలో నిలబడి మృతి చెందిన వారి గురించి అడిగారు.

ఇంత రాజకీయ అనుభవం కలిగిన మీ పార్టీ ఇంత ఘోరమైన నిర్ణయం (నోట్ల రద్దు) ఎలా తీసుకున్నదని ప్రశ్నించారు. మీ నిర్ణయం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసుకుందన్నారు. ఏ తప్పు చేయని సామాన్యులను బలి చేశారన్నారు. తాను ఈ ఒక్క ప్రశ్నే అడుగుతున్నానని చెప్పారు.
'నేను బీజేపీ ఏపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథి సింగ్‌ను ఒకే ప్రశ్న అడగుతున్నా. ఎంతో అనుభవం కలిగిన నేతలు, ప్రజాప్రతినిధులుగా కూడా ఎంతో అనుభవం కలిగిన మీ పార్టీ (బీజేపీ) నోట్ల రద్దు వంటి దారుణమైన నిర్ణయాన్ని ఎలా తీసుకుంది. నోట్ల రద్దు కారణంగా ఏ తప్పు చేయని సామాన్యులు మృతి చెందారు' అని పేర్కొన్నారు.
-
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications