గేరు మార్చిన పవన్, రోడ్ మ్యాప్ ఫిక్స్- బిగ్ టర్న్..!!

పవన్ తన రాజకీయ భవిష్యత్ పై కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అధికారంలో ఉంటూనే పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసారు. ఇందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. కూటమిలో ఉన్నా.. తమ లక్ష్యం ఏంటో స్పష్టం చేసేందుకు రెడీ అయ్యారు. భవిష్యత్ పొత్తులు ఎలా ఉన్నా
తన రాజకీయ కార్యాచరణ పైన ప్లీనరీ వేదికగా ప్రకటనకు సమాయత్తం అవుతున్నారు. ప్లీనరీ లో కీలక తీర్మానాల పై కసరత్తు జరుగుతోంది. ప్రజలు - పార్టీ లక్ష్యంగా కొత్త అజెండాతో పవన్ ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

పవన్ కసరత్తు
జనసేన భవిష్యత్ పైన పవన్ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పిఠాపురం వేదికగా పార్టీ నిర్వహించనున్న తొలి ప్లనరీ వేదికగా రాజకీయంగా ఆసక్తి కర అంశాలతో తీర్మానాల పై కసరత్తు జరుగుతోంది. ఇదే వేదిక గా పార్టీ భవిష్యత్ పైన పవన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పార్టీ బలోపేతం తో పాటుగా ప్రభుత్వంలో భాగస్వామిగా తమ కార్యాచ రణ.. లక్ష్యాలను ప్లీనరీ లో పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Pawan Kalyan decided to announce his political road map in party plenary in pithapuram

ప్లీనరీ వేదికగా
ప్రభుత్వంలో ఉంటూనే పిఠాపురం లో చేసిన వ్యాఖ్యలు .. తిరుపతి తొక్కిసలాట ఘటన సమయం లో చేసిన డిమాండ్ల పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటికి పార్టీ ప్లీనరీ నుంచే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన పొలిటికల్ అజెండాను పవన్ ప్రకటించనున్నారు. పార్టీ పదేళ్ల ప్రస్థానం గురించి వివరిస్తూ.. భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ప్రభుత్వం లో ఉన్నా..లేకున్నా జనసేన రాజకీయ పాత్ర పైనా పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాల సమాచారం.

భవిష్యత్ కార్యాచరణ
ప్రభుత్వంలో ఉన్న సమయంలో పొత్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలనే అంశం పైన పవన్ ప్రత్యేకంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో బాధ్యత కలిగిన మిత్రపక్షంగా జనసేన పాత్ర గురించి వివరించనున్నారు. రాష్ట్రంలో
తాజా రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూనే...పార్టీ కేడర్ కు పవన్ స్పష్టత ఇస్తారని తెలు స్తోంది. అదే సమయంలో పార్టీ కేడర్ కు భరోసా కల్పిస్తూ పవన్ రాజకీయ తీర్మానం ఉండేలా చర్చ లు జరుగుతున్నాయి. పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ తన రాజకీయ అజెండాను స్పష్టం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, జనసేన ప్లీనరీ వేదికగా జరిగే నిర్ణయాల పైన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+