ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలి: బాబును కోరిన పవన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కాలేజీ యాజమాన్యం చేసిన తప్పిదం విద్యార్థులు విద్యార్థులు నష్టపోకుండా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు.

ట్విట్టర్ ద్వారా ఆ సమస్యను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఫాతిమా క‌ళాశాల విద్యార్థులు విలువైన విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోయారని, యాజ‌మాన్యం త‌ప్పిదం వ‌ల్ల అమాయ‌కులైన విద్యార్థులు ఇబ్బందులు ప‌డ‌కూడ‌దని ఆయన అభిప్రాయపడ్డారు.

pawan kalyan demands Chandrababu resolve Fatima college issue

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఆయన కోరారు.ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ కాలేజీలో చేర్పించారని ఆయన గుర్తు చేశారు.

ఏడాదిపాటు చదివితే ఆ విద్యాసంవత్సరం కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు.కాలేజీ యాజమాన్యం చేసిన తప్పిదం కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan kalyan demanded Ap Chief Minister Chandrababu Naidu resolve Fatima college students issue. pawan kalyan responded over Fatima college students issue on twitter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి