బాలకృష్ణ సర్! ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కళ్యాణ్ భారీ విరాళం
Pawan Kalyan: తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR trust) ఆధ్వర్యంలో 'యుఫోరియా' పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సాదరంగా స్వాగతించారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 'యూఫోరియా మ్యూజికల్ నైట్' (Euphoria Musical Night) కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. కష్టాలు, ఒడుదుడుకుల్లోనూ చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గర నుంచి చూశానని అన్నారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

బాలకృష్ణ అలా పిలవమంటారు..
బాలకృష్ణను ఎప్పుడు కలిసినా.. బాలయ్య అని పిలువు అంటారు కానీ.. తనకు సర్ అనే పిలవాలనిపిస్తుందని పవన్ చెప్పారు. ఎవరినీ లెక్కచేయని వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అని అన్నారు. ఎన్ని తరాలు వచ్చిన ప్రేక్షకులు ఆకర్షించే నటన బాలకృష్ణ సొంతమని కొనియాడారు. సినిమాల్లోనూ కాదు.. సేవల్లోనూ ముందుంటారన్నారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో గుర్తించిందని పవన్ కళ్యాన్ చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్‌కు రూ. 50 లక్షల విరాళం
ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ సేవ చేసుకుంటూ వెళ్తోందని పవన్ తెలిపారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారన్నారు. ఆయన అమరజీవి అని అన్నారు. ఒక మంచి పని ప్రారంభించడం, దాన్ని కొనసాగించడం చాలా కష్టమని అన్నారు. అలాంటిది 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం.. ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఈవెంట్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పవన్ కళ్యాణ వ్యాఖ్యానించారు.
AP Deputy CM @PawanKalyan garu announced 50 lakhs donation to NTR Charitable trust. 🙏 @ntrtrust @ncbn @ManagingTrustee pic.twitter.com/bl0jnfD5be
— Trend PSPK (@TrendPSPK) February 15, 2025
తన దగ్గరకు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబు కార్యాలయానికి లేఖరాస్తే.. వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. తామంతా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమవంతు సాయం చేస్తామని పవన్ చెప్పారు. తాను కూడా తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. యూఫోరియాకు తాను టికెట్ కొనకుండా వచ్చానని.. ఇది తనకు గిల్టిగా అనిపించిందన్నారు. అందుకే రూ. 50 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications