పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్: ఏపీ కులపిచ్చి రాజకీయాలపై తెలంగాణా మంత్రి వేముల షాకింగ్ వ్యాఖ్యలు!!

పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో ఏపీ కులపిచ్చి రాజకీయాలపై తెలంగాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

మార్చి 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులకు, బిఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలను టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, కుల పిచ్చి తోనే ఏపీ అభివృద్ధి శూన్యంగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలే బీఆర్ఎస్ ఏపీ ని టార్గెట్ చేయడానికి కారణం అవుతున్నాయి.

 కులపిచ్చి రాజకీయాలపై మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు

కులపిచ్చి రాజకీయాలపై మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నేతలు పార్టీలోకి చేరిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో నంద్యాల, ప్రకాశం, కర్నూలు జిల్లా సహా, పలు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏపీ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కుల పిచ్చి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఆగమైందని వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు

చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు


గత తొమ్మిది సంవత్సరాలుగా చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అడ్రస్ లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబును, జగన్ ను చూసిన ఏపీ ప్రజలకు ఇంకా రాజధాని నిర్ణయం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా మిగిలిపోవడానికి కారణం ఆ రెండు పార్టీల రాజకీయాలేనంటూ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో దురదృష్టం ఇదే

ఏపీలో దురదృష్టం ఇదే


19 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ప్రపంచానికే తలమానికంగా మారితే, 1000 కిలోమీటర్ల సముద్రతీరమున్న ఏపీలో ఎందుకు అభివృద్ధి జరగలేదని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని నాయకులు, పాలకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే అధికారపక్షం, ప్రతిపక్షం రెండు మోడీ చంకలో చేరాయని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే నాధుడే లేకుండా పోయారని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు, జగన్ ప్రజా సంక్షేమం మరచిపోయారు

చంద్రబాబు, జగన్ ప్రజా సంక్షేమం మరచిపోయారు

ఇక కుల,మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, అందుకే కేసీఆర్ నాయకత్వం ప్రస్తుతం దేశానికి కావలసిన అవసరం ఉందంటూ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయారని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏపీలో విస్తరిస్తున్న క్రమంలో కొంతమంది కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ఎవరూ ఆపలేరు

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ఎవరూ ఆపలేరు


సీఎం కేసీఆర్ పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణను ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సీఎం కేసీఆర్ కు దురుద్దేశం లేదని, కక్ష అంతకంటే లేదని, కెసిఆర్ కు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలంగాణ తరహాలో అభివృద్ధి చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+