pawan kalyan ఎన్నికల స్ట్రాటజీ మారింది: చంద్రబాబు ఎఫెక్ట్; జనసేనలో అసలేం జరుగుతుందంటే!!

సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తానని మొదలుపెట్టిన జనసేన ప్రస్థానం ప్రస్తుత ఎన్నికలలో ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టనని, నీతి నిజాయితీలతో ఓటు వేసిన వారే తనకు ఓటు వేస్తారని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆలోచన ధోరణిని మార్చుకుని, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం విజయ అవకాశాలు ఉన్నవారికి టికెట్లు కేటాయించాలని, అర్థబలం ఉన్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయకపోతే ఓటర్లు ఓటు వేయరు అన్న కఠిన నిజాన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులలో భాగంగా ఎన్నికలకు వెళుతూ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఈసారి ఆలోచిస్తున్న తీరుపై పార్టీ శ్రేణుల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Pawan Kalyan Election Strategy Changed with Chandrababu Effect; interest on tdp Janasena candidates list!!

ఉద్యమకారులకు, సామాజిక కార్యకర్తలకు టికెట్లు ఇస్తే వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే ఓట్లు పడవు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న ఎన్నికలకు చంద్రబాబు సలహాలతో అసలు రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఇక నేడు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టికెట్లు ఎవరికి కేటాయించారు అన్నదానిపై ప్రస్తుతం పార్టీలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

నేడు విడుదలయ్యే జాబితా ఆధారంగా ముందుముందు విడుదలయ్యే జాబితాలలో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది అంచనా వేసే పనిలో పడ్డారు జనసేన నేతలు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్లు ఆశిస్తున్న నేతలు నగదు సిద్ధం చేసుకుని సీటు కోరాలని పార్టీ శ్రేణులకు సంకేతం పంపించినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు ఎంత ఖర్చు చేయగలరు అని నిర్మొహమాటంగా పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Pawan Kalyan Election Strategy Changed with Chandrababu Effect; interest on tdp Janasena candidates list!!

గత రెండు ఎన్నికలకు పూర్వమే పార్టీని ప్రారంభించి, రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి సొంత నిధులను ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈసారి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీ నుంచి ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే అర్థమయ్యేలా చెప్పినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ మారిందని, వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా, చంద్రబాబు సూచనలతో పోరాటం చేయబోతున్నారని జనసేనలో ఆసక్తికర చర్చ సాగుతుంది. డబ్బు మాత్రమే కాదు ప్రజల్లో బలం కూడా ఉన్నవారికే స్థానం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+