టిపై వైఎస్, జగన్: పవన్ వ్యాఖ్యలు ఆలోచింపచేశాయా?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో చేసిన పలు వ్యాఖ్యలు ప్రజల్లో ఆలోచనను రేకెత్తించాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి, బిజెపి కూటమి తరఫున పవన్ కళ్యాణ్ తెలంగాణ, సీమాంధ్రల్లో జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోను, సీమాంధ్రలోను ఆయన ప్రచారం టిడిపి, బిజెపి కూటమికి బాగా కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

సీమాంధ్రలో పవన్ తన ప్రచారంలో విభజనపై తన వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. విభజన పాపం వైయస్, జగన్‌లదేనని ఆయన నొక్కి చెప్పారు. 2004కు ముందు కూడా తెలంగాణవాదం ఉందని, అయితే ఆ తర్వాత వైయస్ దోపీడీ వల్ల అది మరింత ఊపు అందుకుందని, కెసిఆర్‌తో సీమాంధ్రులు తిట్లు పడడానికి వైయస్ తెలంగాణ దోపిడీయే కారణమని పవన్ వ్యాఖ్యానించారు. ప్రచారం చివర్లో పవన్ వీటిని పదే పదే చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింప చేసి ఉంటాయని అంటున్నారు.

Pawan Kalyan emerges popular poll campaign

తెలంగాణలోను పవన్ మేజిక్ కొంత పని చేసిందని అంటున్నారు. తెలంగాణలో టిడిపి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యతిరేకతలో టిడిపి కేవలం ఐదుకు అటు ఇటు మాత్రమే సీట్లను గెలుచుకుంటుందని అందరూ లెక్కలు వేశారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీ 15 సీట్లను గెలుచుకుంది.

టిడిపి, బిజెపి కూటమి 15కు పైగా సీట్లు గెలుచుకుంటాయని పలు సర్వేలు చెప్పినప్పటికీ అందులో బిజెపి సీట్లే ఎక్కువగా ఉంటాయని భావించారు. కానీ బిజెపి హైదరాబాదు మినహా తెలంగాణలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. దానికి టిడిపితో పొత్తే కారణమని పలువురు భావిస్తున్నారు. అది అలా ఉంటే.. తెలంగాణలో పలు సీట్లను టిడిపి గెలుచుకోవడం... బిజెపితో పొత్తు, పవన్ ప్రచారం కారణంగానే ఉంటున్నారు.

చంద్రబాబు చెప్పిందే మోడీ చెప్పినా...

తెలంగాణలో, సీమాంధ్రలో చంద్రబాబు చెప్పిందే పవన్ చెప్పారని చెప్పవచ్చు. అయితే పవన్ సినీ నటుడు అయినందువల్ల ఆయన చెప్పిన వ్యాఖ్యలు మరింతగా ప్రజల్లోకి చొచ్చుకు పోయాయని అంటున్నారు. ఆ కారణంగానే సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి, తెలంగాణలో ఊహించిన వాటి కంటే ఎక్కువ సీట్లు గెలిచేందుకు తోడ్పడిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+