ఇన్‌స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. ఇక రచ్చేనా!!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రాజకీయాలలో ప్రజల వద్దకు వెళ్లేందుకు వారాహి విజయ యాత్ర ద్వారా శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి చెప్పాలి అనుకుంటే జనసేన అధికారిక వెబ్ సైట్ నుండి, అలాగే ట్విట్టర్ ద్వారా తాను చెప్పదలుచుకున్నది చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో తీరికలేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత వారాహీ విజయయాత్ర ప్రారంభించాలని రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం కూడా ఆయన సిద్ధమవుతున్నారు.

ఒకపక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే, మరో పక్క సినిమాలలోనూ ఊపిరి ఆడనంత పని చేస్తున్నారు. ఇటీవల వారాహి విజయయాత్రలో జ్వరంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ బ్రో సినిమాకు సంబంధించి టీజర్ డబ్బింగ్ పూర్తి చేశారు. ఇంత బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా టచ్ లో ఉండటానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త అప్డేట్ ను మెగా బ్రదర్ నాగబాబు అందించారు.
సోషల్ మీడియా ద్వారా అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను పలకరించనున్నారని జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్లో నాగబాబు ఓ పోస్ట్ పెట్టారు. అయితే పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడూ అన్న దానిపై మాత్రం నాగబాబు క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటికే ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్, మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న కారణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ను ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న పవన్ త్వరలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు కీలకమైన అప్డేట్ చేశారు.












Click it and Unblock the Notifications