మళ్లీ ఇలాంటి సానుభూతి ప్రకటన చేసే పరిస్థితి రావొద్దు: బోటు ప్ర‌మాదంపై ప‌వ‌న్ దిగ్భ్రాంతి

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా న‌దిలో ప‌డ‌వ ప్ర‌మాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాల వాసులకు జ‌రిగిన ప్ర‌మాదం ప‌ట్ల జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు.

Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

విదేశాల‌లో ఉన్న తనకు ఈ సంఘ‌ట‌న ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా తెలిసిందని, చిన్న చిన్న నిర్ల‌క్ష్యాల‌కు ఇన్ని విలువైన ప్రాణాలు కోల్పోవ‌డం న‌న్ను క‌ల‌చివేసింద‌న్నారు.

Pawan Kalyan expresses grief over the tragedy

మృతుల ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్థున్నాను లాంటి మాట‌లు చెప్ప‌డం ద్వారా వారి కుటుంబాల‌కి జ‌రిగిన లోటుని పూడ్చ‌లేమ‌న్నారు. ప్ర‌భుత్వ సంస్థ‌లు, ప్రయివేటు రంగం వారు మ‌నుషుల ప్రాణాల‌కు సంబంధించి మ‌రిన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంఘ‌ట‌న మళ్లీ గుర్తు చేసింద‌న్నారు.

మరోసారి ఇలాంటి సానుభూతి ప్ర‌క‌ట‌న చేయాల్సిన ప‌రిస్థితి, అవ‌స‌రం రాకుండా ఉండే ప‌రిస్థితులు క‌లిగించాల‌ని ప్ర‌భుత్వాన్ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan expressed grief over the boat capsized tragedy.
Please Wait while comments are loading...