నేను పవన్ కల్యాణ్ అభిమానినే.. కానీ!?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... అభిమానుల్లో ఈ పేరు చెప్పగానే వారికి తెలియకుండానే ఒకరకమైన పూనకం వచ్చేస్తుంది. ఏ కథానాయకుడికి లేనంత ఫ్యాన్ బేస్ పవన్ కల్యాణ్ కే ఉంది. కానీ ఆ అభిమానం మొత్తం ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి నీరుగారి పోతోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారేకానీ ఎన్నికల్లో ఓటేసేందుకు మాత్రం క్యూ కట్టడంలేదు.

దూకుడైన రాజకీయం

దూకుడైన రాజకీయం

పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలం నుంచి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. సభ పెట్టినా, సమావేశం పెట్టినా భారీగా అభిమానులు తరలివస్తున్నారుకానీ వారంతా కార్యకర్తలుగా ఎప్పుడు మారతారు? అనేది ప్రధానమైన ప్రశ్నగా నిలిచింది. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. గత ఎన్నికల సమయంలో తరలివచ్చిన అభిమాన జనాన్ని చూసి పొంగిపోయానని, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే తెలిసిందని, వారంతా అభిమానులేకానీ పార్టీ కార్యకర్తలు కాదని అన్నారు.

కార్యకర్తలే పునాది

కార్యకర్తలే పునాది

ఏ పార్టీకైనా పునాది ముఖ్యం. అది బలంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా వేయవచ్చు. ఈలలు వేయడం, అరుపులు ఎందుకని, ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని అభిమానులకు సూచించారు. అభిమాన గణాన్ని పార్టీ శ్రేణులుగా మార్చుకోవడంలో జనసేన విఫలమైందని చెప్పవచ్చు. కార్యకర్తలుగా అభిమానుల్ని మార్చుకోవడానికి ఏం చేయాలనే విషయంపై పార్టీలోని సీనియర్ నేతలు సైతం దృష్టిసారించలేదు.

వారు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండటం అవసరం. బూత్ లెవల్ లో పార్టీని బలోపేతం చేసుకుంటూ రావాలి. తాను పవన్ కల్యాణ్ అభిమానినని ప్రతి ఒక్కరూ చెబుతారేకానీ తాను జనసేన కార్యకర్తను అని ఒక్కరూ చెప్పడంలేదు.

ప్రతి అభిమానిని కార్యకర్తలా మార్చుకోవాలి

ప్రతి అభిమానిని కార్యకర్తలా మార్చుకోవాలి

ఏ పార్టీకైనా కార్యకర్తల బలమే పునాది. అది పటిష్టంగా ఉంటేనే ఎన్ని ఎన్నికలైనా ఎదుర్కోవచ్చు. ఇటీవలికాలంలో దూకుడుగా రాజకీయం చేస్తున్న పవన్ పలు కార్యక్రమాలు వరుసపెట్టి చేస్తున్నారు. ఎన్నికలయ్యేంతవరకు ఇదే దూకుడు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కు ఉన్న ప్రతి అభిమాని ఒక కార్యకర్త అయితే అతనొక శక్తివంతమైన నేత అవుతాడని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి గ్రామ స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకొని జనసేన బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+