జనసేన నేతలకు పవన్ క్లాస్-మోడీ, బాబు నమ్మినా మీరు మాత్రం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ముగించుకుని ఏపీలో జనసేన విస్తృత భేటీలో పాల్గొనేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో సొంత పార్టీ నేతల తీరుపై పవన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.తనను ప్రధాని మోడీ , బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధం చేసుకున్నారని, కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదన్నారు. తనకొక భావజాలం ఉందని, దాన్ని అర్ధం చేస్కోపోతే ఎలా అని మండిపడ్డారు. ఎన్నికలకు వంద రోజులే సమయం ఉందని, ఎలక్షనీరింగ్ చాల ముఖ్యమని నేతలకు సూచించారు.

జనసేనకు ఇవాళ ఆరు లక్షల కార్యకర్తల బలం ఉందని, యువతలో తమ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇంతమంది యువత మద్దతు ఉందనే గర్వం రాకూడదన్నారు. తమ పార్టీకి యువత చూసే తెలంగాణలో 8 సీట్లలో పోటీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు ఏపీలోనూ జనసేనను బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.

pawan kalyan fire on janasena leaders, wont understand even after modi, nadda, babu...

ఏపీలో అధికార వైసీపీకి ఓ భావజాలం అంటూ లేదని పవన్ విమర్శించారు. ఎందుకు పనిచేస్తున్నారో వైసీపీ నేతలకు తెలియదని, అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తున్నామంటారని పవన్ ఆక్షేపించారు. కానీ జనసేన పార్టీ అలా కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు సీరియస్ గా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. గతంలో ఏపీ ప్రభుత్వం సినిమాలు ఆపినా, బెదిరింపులకు దిగినా తాను స్వయంగా పోరాడానని, అంతే తప్ప బీజేపీ పెద్దల వద్దకు వెళ్లి సాయం అడగలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+