వ్యక్తిత్వంలో ఓడించలేని వాళ్లే..: పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కులం గురించి వ్యాఖ్యానించారు. బహుశా తనకు కులాన్ని అంటగట్టడంపై ఆయన ఆ విధంగా స్పందించి ఉంటారు.

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకానివాళ్లు... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాట ఎవరు చెప్పారో తెలియదు గానీ ఓ సీనియర్ జర్నలిస్టు ఆ ఉటంకింపుతో ఈ రోజు ఉదయం గ్రీట్ చేశాడని ఆయన చెెప్పారు.

Pawan Kalyan fresh to caste polarisation

దాన్ని పంచుకోవాలని అనిపించిందని, శుభదినమని ఆయన శనివారం ఉదయం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మన చుట్టూ ఉన్న కుల విభజన, కుల సమీకరణ, అధికా రాజకీయాలు నిజంగానే హెచ్చరిక నిలిచాయని ఆయన అన్నారు.

అవి ఆర్థిక ప్రగతిని దెబ్బ తీయడమే కాకుండా మన సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయని ఆయన అన్నారు. మన సమాజం సామూహిక మనస్తత్వాన్ని దెబ్బ తీస్తాయని అన్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan says"The rise of caste division, caste polarisation & the power politics played around is truly alarming.It will not only hit the economic progress but also it will do irreversible damage to our society and to the collective psyche of our society".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి