పవన్ కల్యాణ్ చేసిన పనికి అందరూ ఫిదా
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. జనం ఎక్కువగా రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండ కూడా తీవ్రంగా ఉండటంతో అభిమానులతోపాటు పోలీసుల్లో కూడా అలసట కనిపించింది.
పవన్ కళ్యాణ్ కి అత్యంత సమీపంలో విధులు నిర్వహిస్తున్న పి. గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ చెమటలు కక్కుతూ అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్ కల్యాణ్ సీఐ ప్రశాంత్ కుమార్ కు ఎనర్జీ డ్రింకును అందించారు. అది తీసుకున్న సీఐ తర్వాత కొంత ఉపశమనం చెందారు. పోలీస్ అధికారికి పవన్ కల్యాణ్ డ్రింక్ అందిస్తున్న ఫొటో, ఆ డ్రింక్ ను తాగుతున్న పోలీసు అధికారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కల్యాణ్ మానవీయత గురించి జనసైనికులు ట్రెండింగ్ చేస్తున్నారు.

అకాల వర్షానికి కడియపు లంకలో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జనసేనానికి తమ ఇబ్బందులను తెలియజేశారు. కల్లాల్లోనే ధాన్యం మొలకెత్తి తీవ్రంగా నష్టపోయామని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదని వాపోయారు. తర్వాత కడియపు లంక నుంచి భారీ ర్యాలీగా రావులపాలెం చేరుకున్నారు. కొత్తపేట మండలంలోని అవిడి ప్రాంతంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలతోపాటు మొలకెత్తిన ధాన్యం రాశులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆయన వెంట పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు తదితరులున్నారు.












Click it and Unblock the Notifications