పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో ఏపీకి మోడీ గుడ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుంది. గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూపించాలని, ప్రజల మన్ననలు పొందాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడిత పీడిత వర్గ ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి లబ్ది చేకూర్చే అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్
ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు. కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు.

పని దినాల పెంపు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేబర్ బడ్జెట్ లో పని దినాలను పెంచి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు అంగీకరించిదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు.
ఉపాధి హామీ కూలీల కోసం రాష్ట్ర ప్రతిపాదనలు అంగీకరించిన కేంద్రం
లేబర్ బడ్జెట్ మొదటి విడతగా 15 కోట్ల పని దినాలు మంజూరు చేయగా అవి జూన్ నెలాఖరుకే పూర్తయ్యినందున అదనపు పని దినాల కోసం ఈ ప్రతిపాదనలు పంపామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి పనికి వెళ్ళే కూలీలకు గుడ్ న్యూస్
అదే విధంగా ఇప్పటి వరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వర విడుదలకు సమ్మతించారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బులు అందటమే కాకుండా వారికి పని దినాలు కూడా పెరగనున్నాయి.












Click it and Unblock the Notifications