పవన్ కళ్యాణ్ నినాదం పనిచేయదు: ఉత్తమ్ కుమార్

వచ్చే ఎన్నికల్లో సిపిఐ, మజ్లీస్ పార్టీలతో పొత్తులకు అవకాశం ఉందని ఆయన అన్నారు. శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు లేనట్టేనని ఆయ స్పష్టం చేశారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని మరో నేత మధుయాష్కి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నేతలు శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనర్సింహ, గీతారెడ్డి, మధుయాష్కి, సురేష్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు.
ఢిల్లీలోని వార్ రూంలో ఢిల్లీ వెళ్లిన తెలంగాణ నేతలతో కాంగ్రెసు అధిష్టానం నాయకులు దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై, ఇతర పార్టీలతో పొత్తులపై వారు చర్చించారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు 119 శాసనసభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది.












Click it and Unblock the Notifications