జగన్ వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అలాంటి పోస్టులు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులకు జగన్ హెచ్చరిక చేసారు. దీని పైన స్పందించిన పవన్ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యల పై స్పందించారు. అధికారులను బెదిరిస్తే సుమోటో కేసులు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ పైన స్పందించిన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారులు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో తాము అధికారంలోకి వచ్చిన తరువాత వదిలేది లేదని తేల్చి చెప్పారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని స్పష్టం చేసారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు కూటమి నేతలు లక్ష్యంగా సోషల్ మీడియా లో పోస్టులు చేసిన వారి పైన కేసులు కొనసాగుతున్నాయి. పలువురిని అరెస్ట్ చేసారు. వైసీపీ సైతం తమ పార్టీ నేతల పైన పోస్టులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల పైన డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు.

Pawan Kalyan indirect warns Jagan over his comments on Police officers

గుంటూరులో పర్యటించిన పవన్ విధుల్లో ప్రాణాలు వదిలిన అటవీ శాఖ అధికారులకు నివాళి అర్పించారు. అడవులను సంరక్షించడంలో ఐఎఫ్ఐఎస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారని గుర్తుచేశారు. వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ‌లో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా నేను మద్దతుగా ఉంటానని స్పష్టం చేసారు. అందు కోసం సీఎంతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు.

తమది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం కాదని పవన్ వ్యాఖ్యానించారు. అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని మాజీ సీఎం జగన్ తాజా వ్యాఖ్యల పైన పవన్ పరోక్షంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలోనే నేరాలు పెరిగాయని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+