ఏడు లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ, ఇవే
హైదరాబాద్: ప్రశ్నించడానికి పార్టీ అంటూ జన సేన పార్టీని స్థాపించనున్న పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్ తన పార్టీకి ఏడు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. ఆ లక్ష్యాలను ఆయన శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసే సమావేశంలో వెల్లడించే అవకాశాలున్నాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముఖ్యంగా ఏడు లక్ష్యాలలతో జనంలోకి రానుందని సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 10వ తేదీన ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుతో పాటు పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు, విధానాలను అఫిడవిట్లో పొందుపర్చారు. దానిలో తనకున్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.

పార్టీ ప్రజలకు చేయాల్సిన పనుల గురించి స్పష్టంగా ఏడు లక్ష్యాలను నిర్ధారించుకున్నారు. వాటిలో 1. ప్రాథమిక హక్కులను కాపాడడం, 2. పారదర్శక పాలన అందించడం, 3. సురక్షితమైన జీవనం కల్పించడం, 4. శాంతిభద్రత విషయంలో కఠినంగా వ్యవహరించడం, 5. సామాన్యులకు చట్ట పరిధిలో న్యాయం చేయడం, 6. పోలీసు యంత్రాంగం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంచడం 7. అందరికీ వైద్య సౌకర్యం కల్పించడం
ఆ ఏడు లక్ష్యాలతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రజాసేవకు రాజకీయాలను ఆధారం చేసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications