మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్... జనసేనానికి వినతుల వెల్లువ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతులు వెల్లువగా మారాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం మచిలీపట్నంలో కొనసాగుతున్న జనవాణి కార్యక్రమంలోనూ ప్రజలు బారులు తీరి సమస్యలను చెప్పుకుంటున్నారు.
ప్రజా సమస్యలకు గళంగా మారి వారికి భరోసా కల్పిస్తున్న జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన వారి సమస్యలను వింటున్నారు. కరెంటు మీటర్ రీడర్స్ ఉద్యోగులు జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు తొలి అర్జీని ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ముస్లిం సోదరులు పవన్ కళ్యాణ్ ను కలిశారు.

ముస్లిం లకు మచిలీపట్నంలో కనీసం పూర్తిస్థాయి ఖబరస్తాన్ లేదని వారు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లారు. ఎవరైనా చనిపోతే స్థలం లేక పూడ్చిన శవాన్ని మళ్ళీ త్రవ్వి అక్కడే పూడ్చే దుస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది మారాలి, జనసేన ప్రభుత్వం వచ్చాక పూర్తి వసతులతో ఖబరస్తాన్ ఏర్పాటు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్.
గ్రామ పంచాయతీల సమస్యలపై పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. మాకు నిధులు ఇవ్వకుండా ఇచ్చాం అని వైసిపి ప్రభుత్వం చెబుతోందని దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ 8,660 కోట్లు దోచుకున్న దొంగలు ఎవరు? వైసీపీ ప్రభుత్వమే దొంగ. కనీసం గ్రామ సచివాలయంలో సర్పంచ్ కు స్థానం లేదు అంటూ మండిపడ్డారు. జనసేన - టీడీపీ ప్రభుత్వం వచ్చాక గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తాం అన్నారు.
సర్వ శిక్ష అభియాన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ను కలవక దీనిపై పవన్ కళ్యాణ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇక చేనేత కళాకారులకు ప్రభుత్వం కనీసం ప్రోత్సాహం ఇవ్వడంలేదని, చేనేత కళాకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా పవన్ కళ్యాణ్ స్పందించారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications