• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోని జగన్: ఏకిపారేసిన పవన్ కళ్యాణ్, కార్యాచరణ ప్రారంభం

|

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం కుదేలై ఉపాధి లేక కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీసిపోని విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలున్నాయన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు), కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డా. పసుపులేటి హరిప్రసాద్, సిహెచ్. మనుక్రాంత్ రెడ్డి, ఎ. భరత్ భూషణ్, బి.నాయకర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా, రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు, విధులు, బాధ్యతలను యువతరానికి తెలియచేయడం ద్వారా దేశసమగ్రతను కాపాడగలమన్నారు. అలాగే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి పాలనాపరంగా విధానం లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడటంతోపాటు.. పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఇసుక కొరత, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, ఎన్నికల హామీల అమలులో వెనకడుగు, లోపభూయిష్టమైన మద్యం విధానం అంశాలు చర్చకు వచ్చాయి.

విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ

విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ

కార్మికుల మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో భారీ పాదయాత్ర (లాంగ్ మార్చ్) చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 3 వ లేదా 4 వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర మొదలవుతుంది. ‘ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది. అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖలో చేపట్టే భారీ పాదయాత్ర కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతను తోట చంద్ర శేఖర్‌కు అప్పగించారు పవన్ కళ్యాణ్.

పార్టీ శ్రేణులకు పిలుపు

పార్టీ శ్రేణులకు పిలుపు

రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, పార్టీ కమిటీల నిర్మాణంలో స్వల్ప మార్పులు చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశంపై సబ్ కమిటీని నియమించారు. కమిటీ చర్చించి అక్టోబర్ 24 న పార్టీ అధ్యక్షులకు నివేదిక ఇస్తుంది.

జగన్ హయాంలోనూ పెరిగిన కక్ష సాధింపులు..

జగన్ హయాంలోనూ పెరిగిన కక్ష సాధింపులు..

కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జనసేన నాయకులూ, శ్రేణులపై రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని సభ్యులు ప్రస్తావించారు. అక్రమ కేసులు దాఖలు చేస్తూ కక్ష సాధించడం ప్రజాస్వామిక ధోరణి కాదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి దాడులతో పార్టీ శ్రేణులను, నాయకులను భయపెట్టాలని పాలక వర్గమే భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. శ్రేణులు, నాయకుల్లో మనోస్థైర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ దాడులను ఖండిస్తూ కమిటీ తీర్మానం చేసింది.

సర్కారువి కాదు.. అవన్నీ జగన్ పార్టీ మద్యం దుకాణాలే..

సర్కారువి కాదు.. అవన్నీ జగన్ పార్టీ మద్యం దుకాణాలే..

లోపభూయిష్టమైన మద్యం విధానంతో మద్య నిషేధం ఏ విధంగా సాధ్యమని జనసేన పార్టీ తొలి నుంచి ప్రశ్నిస్తున్న విషయాన్ని సభ్యులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం దుకాణాల నిర్వహించడం ద్వారా అమ్మకాలు తగ్గుతాయని పాలక పక్షం చెబుతున్న మాటలు ఎంత మాత్రం నిజం కావని వస్తున్న ఆదాయం, పెరిగిన అమ్మకాలు చెబుతున్నాయి అని సభ్యులు సమావేశంలో చెప్పారు. దుకాణాలు పెట్టిన జాగా, అందులో ఉద్యోగాలు... అన్నీ వైసీపీ వర్గానికి చెందినవారివే అని - అవి ప్రభుత్వ మద్యం దుకాణాలు కావనీ వైసీపీ మద్యం దుకాణాలు అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

ఉద్యోగుల తొలగింపులో తెలంగాణను మించిన ఏపీ

ఉద్యోగుల తొలగింపులో తెలంగాణను మించిన ఏపీ

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్యల వాళ్ళ సుమారు రెండున్నర లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రస్తావించారు. ‘48 వేలమంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు.. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది' అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రెగ్యులరైజ్ చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదన్నారు.

సీపీఎస్ రద్దుపై వెనడుుగు

సీపీఎస్ రద్దుపై వెనడుుగు

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించిన అంశంపై సమావేశంలో చర్చించారు. సీపీఎస్ రద్దు విషయంలో వైసీపీ వెనకడుగు వేసి, ఉద్యోగ వర్గాలను వంచించిందని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది.

చంద్రబాబుకు తీసిపోని జగన్..

చంద్రబాబుకు తీసిపోని జగన్..

‘రాష్ట్ర గతిని, ప్రగతిని తిరోగమనం పట్టించడంలో చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్!' అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాగా, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో 23,24 తేదీలలో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ నెల 23 వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు, ఈ నెల 24 న నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాలతో పాటు ఆ జిల్లాకి సంబంధించి తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మూడు అసెంబ్లీ స్థానాల సమీక్ష ఉంటుందని సమావేశంలో వెల్లడించారు.

English summary
Janasena Pawan Kalyan lashes out at YS Jagan's government policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more