పవన్ ఎందుకు వెనుకాడుతున్నారు, ఏం జరుగుతోంది..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సడన్ గా పవన్ కల్యాణ్ తన వాయిస్ పెంచారు. మరోసారి వైసీపీని టార్గెట్ చేసారు. తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిలో ఎలాంటి సమస్యలు ఉన్నా అడ్జస్ట్ అవ్వాలని పార్టీ నేతలు సూచనలు చేస్తున్నారు. అటు పార్టీ ఎమ్మెల్యేలకు తన ఆలోచనలను స్పష్టం చేసారు. పవన్ తరచూ వైసీపీ పైన చేస్తున్న వ్యాఖ్యల పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. పవన్ వ్యాఖ్యల వెనుక అసలు లక్ష్యం ఏంటనే విశ్లేషణలు మొదలయ్యాయి.

డిప్యూటీ సీఎం పవన్ వరుసగా వైసీపీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హెచ్చరికలు చేస్తూ.. తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని పదే పదే చెబుతున్నారు. కాగా, పవన్ వ్యాఖ్యల పైన వైసీపీ కీలక నేత బొత్సా సత్యనారాయణ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సీఎం పవన్ భాష ఏ మాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పైన కూటమి నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. ప్రజల్లోకి వెళ్తే వారికే వాస్తవం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసిందని వ్యాఖ్యానించారు. ఈ పథకం డిప్యూటీ సీఎం పవన్ శాఖలోకి వస్తుందని.. కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కు పేదలు అవసరం లేదని విమర్శించారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టాను అని పవన్ చెప్పారని.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించటం లేదని బొత్సా నిలదీసారు.

pawan-kalyan-latest-comments-against-ysrcp-leads-to-new-political-discussions

గెలుపు, ఓటములు సహజమని చెప్పిన బొత్సా.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే అని విమర్శ లు గుప్పించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా యూరియా కొరత లేదని.. ఏపీలో ఎందుకు ఈ సమస్య వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో ఎక్కడా చూసినా పేకాట క్లబ్లులు, సీ పోర్టుల్లో అక్రమ రవాణా జరుగుతుంటే.. చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో పవన్ చెప్పాలని డిమాండ్ చేసారు. పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేసారంటే సమాధానం ఇవ్వటం లేదని మండిపడ్డారు. భూ కేటాయింపుల పైన న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. 15వ ఆర్దిక నిధుల వినియోగానికి బ్రేకులు పడ్డాయన్నారు. డిప్యూటీ సీఎంకు ఆ విషయం తెలుసా అని ప్రశ్నించారు. పవన్ కు మాటలు ఎక్కువ... చేతలు తక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+